వైఎస్సార్..మేరు నగధీరుడు. పులిలా రాజకీయాల్లో బతికారు. తమ మాటే శాసనంగా చేసుకున్నారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిజాయతీగా జీవించిన అరుదైన నేత. ఆయన జీవితం తెరచిన పుస్తకం. అయితే ఆయన జీవితంలో అనూహ్యంగా మరణం వెంటాడింది. నిజానికి మరణం ఎవరికైనా సహజమే. కానీ వైఎస్సార్ చక్కగా రెండవ సారి అధికారంలోకి వచ్చారు. మరో అయిదేళ్ల పాటు అధికారం చేతిలో ఉంది. కానీ ఇంతలోనే ఆయన దుర్మరణం పాలు అయ్యారు.

 

అయితే వైఎస్సార్ కి మిత్రులు శత్రువులు  ఎవరు అన్నది రాజకీయలపైన కాస్తా  అవగాహన ఉన్నవారికి తెలిసే విషయమే. అయితే రాజకీయాల్లో బయట కనిపించేది అంతా నిజం కాదు, వైఎస్సార్ తన మనసులో భావాలను తప్పకుండా పంచుకునేది తన సతీమణి వద్దనే. అందువల్ల ఆమెకు తన గురించి తన మిత్ర శత్రువుల మీద ఏమి చెప్పిఉంటారు అన్నది కూడా ఆసక్తికలిగించే అంశమే.

 

అంతే కాదు వైఎస్సార్ మరణాన్ని ప్రమాదం కాదు అని ఎవరో చేయించారు అన్నది ఆ తరువాత ఆయన కుమారుడు జగన్ పలుమార్లు బహిరంగంగానే  ప్రస్తావించేవారు. మరి ఆ భయాలు, సందేహాలు ఏవైనా విజయమ్మ పుస్తకంలో ఉంటాయా అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. వైఎస్సార్ కి హై కమాండ్ కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు.

 

అయితే అత్యంత ప్రజానాయకుడిగా వైఎస్ ఎదగడం ఢిలీ స్థాయి నాయకులలో కొందరికి నాడు గిట్టలేదని అంటారు. అలా దక్షిణాదికి చెందిన ఒక రాష్ట్ర నాయకుడికి వైఎస్ కి మధ్య కొంత విభేదాలు ఉండేవని అంటారు. మరి ఈ విషయాలు ఏమైనా విజయమ్మ పుస్తకంలో ఉంటాయా అన్నది చూడాలి. ఇక వైఎస్ లేరు అన్న తరువాత విజయమ్మ పడిన బాధ, ఆమె భావాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉండొచ్చు. అదే విధంగా వైఎస్సార్ భోళా శంకరుడిగా నమ్మి ప్రాణం పెట్టిన వారు తరువాత రోజుల్లో ఆ కుటుంబాన్నిపట్టించుకోలేదు  వాటి గురించి ఏమైనా ప్రస్థావనలు  ఇందులో ఉంటాయా అన్న ఉత్కంఠ కూడా ఉంది. చూడాలి మరి ఏం రాశారో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: