ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా కరోనా కు సంబంధించిన విషయాలే తప్ప మిగతా వేటి గురించి చర్చించుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం నెలకొంది. అసలు ఎప్పుడూ ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. బంధువులు, స్నేహితులు ఇలా ఎవరినీ ఇంటికి ఆహ్వానించే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇక పట్టణాల్లో ఈ మహమ్మారి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఇక పట్టణాల్లో ఈ మహమ్మారి ఎక్కువగా ఉండడానికి కారణం విటమిన్ డి లోపం కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, వంటివి పట్టణ వాసులకు శాపంగా మారాయి.

IHG

ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ మహమ్మారి ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో దాడి చేస్తోంది. కరోనా పాజిటివ్ పేషెంట్ల లో సరికొత్త లక్షణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించిన వాటికి భిన్నంగా ఏ లక్షణాలు లేని వారికి కూడా ఈ కరోనా పాజిటివ్ సోకుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనా లక్షణాలు లేని వారికి ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటం, మరికొందరిలో లక్షణాలు ఉన్నా, నెగిటివ్ రిపోర్ట్ రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఈ కరోనా ను గుర్తించేందుకు డబ్ల్యూహెచ్ వో, ఐసిఎంఆర్ మరింతగా దీనిపై దృష్టి సారించాయి.  ప్రస్తుత కరోనా లక్షణాలు ... కడుపులో వికారంగా ఉండడం, విపరీతంగా నీళ్ల విరోచనాలు, రోజులో అయిదారు సార్లు వాంతులు చేసుకోవడం, కడుపు ఉబ్బరం, ఆహారం అరగకపోవడం, చర్మంపై దద్దుర్లు ఇవి రోజురోజుకు తీవ్రతరం అవుతుండడం, అరికాళ్లలో తిమ్మిర్లు, మూర్ఛ, నత్తిగా మాట్లాడడం వంటివి ఇప్పటి వరకు కరోనా లక్షణాలుగా గుర్తించినవి.

 

దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, కళ్ళలో తేడాలు ఉండడం వంటి వాటిని కరోనా లక్షణాలుగా నిర్థారించారు. అలాగే శరీరం బలహీనంగా అనిపించడం, అలసట, గొంతు, తడిబారినట్లుగా ఉండి, విపరీతంగా పొడిదగ్గు, ఊపిరితిత్తుల వ్యవస్థ చిన్నాభిన్నం చేయడం, శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శాతం కుచించుకుపోవడం గొంతులో ఇన్ఫెక్షన్ వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం, అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిర్లు గా ఉండడం, ఫిట్స్ రావడం నత్తిగా మాట్లాడటం వంటివాటిని కూడా కరోనా లక్షణాలుగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: