కరోనా వైరస్.. ప్రపంచాన్ని తలకిందులు చేసి పడేసింది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ రోజు రోజుకు అతి దారుణంగా వ్యాపిస్తుంది. ఇంకా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో మంది పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే ఇలా ఉంది కానీ.. 

 

IHG

 

కరోనా వైరస్ వ్యాపించిన ప్రారంభంలో అంటే మర్చి నెలలో లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ఇప్పటికి అమలు జరుగుతూనే ఉంది. ఇది అంత పక్కన పెడితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వన్య ప్రాణులు అన్ని రోడ్ల మిదకు వచ్చేసాయి. 

 

IHG

 

రోడ్లపైన ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేశాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఢిల్లీ రోడ్లలో తెల్ల కాకి ప్రత్యేక్షం అయ్యింది. మాములుగా కాకులు అంటేనే నల్లగా ఉంటాయి. కొన్ని కాకుల రెక్కలు మాత్రం ముదురు గోధుమ రంగులో ఉండి ఎర్రగా కనిపిస్తుంటాయి. అయితే, వీటిల్లో తెల్లకాకులు కూడా ఉంటాయి. 

 

IHG

 

ఇంకా ఈ తెల్ల కాకులు చాలా అరుదుగా జనావాసాల్లో కనిపిస్తుంటాయి. తెల్లకాకిని అల్బినో అని పిలుస్తుంటారు. ఈ తెల్లని కాకి ఢిల్లీ రోడ్లలలో కావు కావు అంటూ తీగేస్తుంది. ఇంకా ఈ కాకిని చూసి షాక్ అయినా అందరు ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ తెల్ల కాకి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: