ఉద్దేశపూర్వకంగా టీడీపీ... ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆపడానికి కోర్టుకు వెళ్లినట్లు అందువల్లే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు స్వయంగా సీఎం జగన్ ఇటీవల చెప్పుకొచ్చారు. డి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నట్లు ఆస్తి రూపంలో ప్రజలకు ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీం కోర్టు కి వెళ్ళింది ఏపీ ప్రభుత్వమేనని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు అమ్ముకునే అవకాశం ఇవ్వటం నిబంధనలకు వ్యతిరేక నిర్ణయమని దీన్ని సమర్థిస్తూ జీవో నెంబర్ 44 విడుదల చేయటం వివాదాస్పద నిర్ణయమని హైకోర్టు తెలపడం జరిగింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇంకా ఇది విచారణలో ఉండగానే జూలై 8 వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

జులై 8 వైఎస్ జయంతి సందర్భంగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్టు 15వ తారీఖున మళ్లీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అసైన్డ్ భూములను కొన్నట్లు…  ప్రభుత్వం దీని కోసం 7,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో అసైన్డ్ భూములకు విరుద్ధంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టులో కూడా ఈ విధంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెప్పడంతో లాస్ట్ మినిట్ లో జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

కానీ వైఎస్ జగన్ దీన్ని ప్రతిపక్షాలపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లడానికి ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా పడినట్లు కామెంట్లు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం విషయంలో న్యాయస్థానాల నుండి వ్యతిరేక తీర్పులు వచ్చే అవకాశం ఉండటంతోనే తెలుగుదేశం పార్టీపై వైసీపీ ప్రభుత్వ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించడం జరిగిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: