ఏదో ఒక రూట్ లో ఏపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం టిడిపి బలహీనమవుతున్న క్రమంలో ఆ స్థానాన్ని ఆక్రమించి క్రమక్రమంగా ఏపీ అధికార పార్టీ వైసిపి హవాను తగ్గించి రాజకీయంగా బలపడాలని చూస్తోంది. ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుంటూ మరింత బల పడుతున్న వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేలా బిజెపి కొద్ది రోజులుగా వైసీపీ నేతలకు గాలం వేసే పనిలో పడింది. ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బిజెపి ట్రాక్ లోకి వెళ్లి పోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. అదే పనిగా వైసీపీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 

IHG

ఆయన అకస్మాత్తుగా ఈ విధంగా వ్యవహరిస్తుండడం వెనక ఖచ్చితంగా బిజెపి అండదండలు ఉన్నాయని, ఆ పార్టీ అండ చూసుకునే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వైసీపీలో మొదలయ్యాయి. రఘురామకృష్ణంరాజు ఒక్కడితో సరిపెట్టకుండా, మరికొంత మంది వైసీపీ ఎంపీలను తమ రూట్లోకి తెచ్చుకునే విధంగా బిజెపి ప్లాన్ చేస్తున్నట్లుగా వైసీపీ అనుమానిస్తోంది. గత కొద్ది రోజులుగా బిజెపి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను సమాన దూరంలో పెడుతూ, బలపడేందుకు బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారాలు కాస్త కలవరానికి గురిచేస్తున్నాయి.

 

టీడీపీ అనుకూల వైసీపీ అనుకూల వర్గాలు బిజెపిలో ఉండడంతో, తమ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అవుతుందని బిజెపి భావిస్తోంది. ఎలాగూ జనసేన మద్దతు ఉంది కాబట్టి ఏపీలో బలపడేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదని, ఇక ఈ కరోనా వ్యవహారం ముగిసిన తర్వాత, ఏపీ ప్రభుత్వ విధానాలపై జనసేనతో కలిసి ప్రజా పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. కాకపోతే ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో, జగన్ వారికి ఎంత వరకు అవకాశం ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: