కరోనా రోగానికి మందు కోసం ప్రపంచం అంతా వెదుకుతోంది. వ్యాక్సీన్  కోసం వందల కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ వ్యాక్సీన్ వచ్చే వరకూ ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న మందులతో తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ఇదిగో కరోనాకు మందు వచ్చేసింది.. అదిగో  కరోనాకు మందు వచ్చేసిందంటూ అప్పుడప్పుడూ మీడియాలో హడావిడి జరుగుతూనే ఉంటోంది.

 


అయితే ఈ హడావిడి చూసి ఓ వ్యాపారి.. దాన్నే తన వ్యాపారానికి లాభాలు తెచ్చే విషయంగా భావించి చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ ఆయన ఎవరంటారా.. ఆయన కేరళలోని ఓ మైసూర్‌ పాక్ వ్యాపారి. తన స్వీటును అమ్ముకునేందుకు ఆయన కరోనా పేరు వాడుకోవాలని ప్రయత్నించాడు. తాను అమ్మే మైసూర్ పాక్ లో ఔషద గుణాలు ఉన్నాయని, అది తింటే కరోనా జబ్బు నయం అవుతుందని ప్రచారం మొదలు పెట్టేశాడు. 

 

 

అసలే కరోనా టైమ్ కదా.. జనం కూడా చూద్దాం.. ఎలా ఉంటుందో అంటూ ఆ స్వీటు తినడం మొదలు పెట్టారు. ఈ రోజుల్లో ప్రతిదీ సోషల్ మీడియాకు ఎక్కాల్సిందే కదా.. అలా ఈ స్వీటు షాపు గురించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. అలా అలా విషయం కేరళ సర్కారు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వరకూ వెళ్లింది. అంతే వాళ్లు వచ్చి ఈ షాపును చెక్ చేశారు. 

 


ఆ వ్యాపారి అమ్మే మైసూర్ పాక్‌ ను పరీక్షించారు. అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా ప్రచారం చేసి అమ్మడం తప్పు కదా అంటూ ఆ నేరం కింద దుకాణానికి సీల్ వేసే శారు. అమ్మకం కోసం ఉంచుకున్న మైసూర్ పాక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదో బిజినెస్ బావుంటుంది కదా అని కరోనా పేరు వాడుకుంటే.. ఇలా అసలుకే మోసం వచ్చే సింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: