తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్ మాటల దాడిని మరింతగా పెంచింది. మొన్నటి వరకు గ్రూప్ తగాదాలతో ఇబ్బందులు పడుతూ, పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కి చేరుకున్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారం చూస్తుంటే, ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పటికే పాత సచివాలయం కూల్చివేత పై ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు టీఆర్ఎస్ పార్టీపై గట్టిగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని ప్రజల కోసం కాకుండా, కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబం కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు.

IHG

కరోనా వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి 10 వేల కోట్లు మంజూరు చేయించి తానేమిటో నిరూపించుకోవాలి అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ప్రజల కోసం చేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్ కి కెసిఆర్ తో మాట్లాడి మూడు వేల కోట్లు ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. తలసానికి హైదరాబాదులో పహిల్వాన్ ఉన్నారేమో, తమకు రాష్ట్రమంతా ఉన్నారు అంటూ హెచ్చరించారు. srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్, హరీష్ రావు ను ఉరికించి కొడతాము అంటూ మాట్లాడేవారని, కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉండి చంద్రబాబు ను ఉరికించి కొడతా అంటూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తలసాని ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ వారికి చెంచాగిరి చేయడం అలవాటు అని మండిపడ్డారు. అనవసరంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకుంటే, ఇకపై చూస్తూ ఊరుకోము అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు.

 

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు ప్రభుత్వం తరఫున జీవో విడుదల చేయకపోతే, హైదరాబాద్ లో తాను ఒకరోజు దీక్ష చేస్తానని, దీక్ష చేసినా స్పందించకపోతే హైదరాబాద్ కేంద్రంగా రోజుకు ఒక  కార్యక్రమం చేస్తానంటూ జగ్గారెడ్డి హెచ్చరికలు చేశారు. అలాగే పాత సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తమ హంగూ ఆర్భాటం ప్రదర్శించడానికే ఈ విధంగా ప్రజల సొమ్మును టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: