రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా అయినా మలుపు తిరగవచ్చు. రాజకీయాలంటేనే గజిబిజి గందరగోళం అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ముందుచూపు అనేది చాలా ముఖ్యం. ముందుచూపు ఉంటే రాజకీయంగా ఎదురే లేకుండా ముందుకు వెళ్లవచ్చు. అటువంటి ముందుచూపు గల నాయకుల్లో ముందుంటారు విశాఖ జిల్లా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన ఇప్పటికీ రాజకీయంగా ఓటమి ఎదుర్కోకుండా ఎప్పుడూ ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు అంటే కారణం ఆయన ముందు చూపు . 2019 ఎన్నికల్లో గంటా జగన్ ని ఎదుర్కొని మరీ విజయం సాధించారు. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా, వర్క్అవుట్ కాకపోవడంతో, సైలెంట్ అయిపోయారు. ఇక ఎన్నికల ఫలితాలు తరువాత కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా, అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

 

IHG

ఇక బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం ఒకదశలో నడిచింది. కానీ గంటా మనసు మాత్రం వైసిపిలో ఉండిపోయింది. గంటా రాజకీయ నాయకుడిగానే కాక, మంచి వ్యూహకర్త అనే పేరు కూడా ఉంది. ఎప్పుడు ఏ పార్టీ వైపు మళ్ళుతుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయగల నేర్పరి. అందుకే ఆయన ఎప్పుడూ అధికార పార్టీలో ఉంటూ వస్తున్నారు. ఆ విధంగానే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఎంతగా ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. అయిష్టంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ టిడిపి సూచించిన అభ్యర్థికి ఓటు వేశారు. అలా అని టిడిపిపై మంచి అభిప్రాయంతో ఉన్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంత కాలం టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని, ఒంటరిగా 2024 ఎన్నికల బరిలోకి వెళ్లినా ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం ఆయనలో ఉంది. ఇక లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, పూర్తిగా టిడిపి నావ మునిగిపోతుందని భావిస్తున్నారు.

 

కాకపోతే 2019 ఎన్నికల్లో మళ్లీ 2014 నాటి ఎన్నికల పొత్తు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే బిజెపి, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల బరిలోకి వెళతాయని బలంగా నమ్ముతున్నారు. అదే జరిగితే ఆ కూటమి గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, గంట అంచనా వేస్తున్నారు. అయినా జగన్ కు తిరుగుండదని, కాకపోతే కూటమి కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం మారేందుకు కూడా సరైన పార్టీ లేకపోవడంతో అయిష్టంగానే ఆయన టిడిపిలో కొనసాగుతున్నట్లు విశ్లేషకుల అంచన వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: