ప్రపంచంలో ఇప్పుడు అందరు తప్పక చేస్తున్న పని ఏంటంటే.. ముఖానికి మాస్క్ కట్టుకోవడం.. ఇది విధిలేని పరిస్దితి.. దీంతో పాటుగా శానిటైజర్.. ఈ రెండు ప్రజలకు ఆయుధాల వంటివి.. ఇవి లేకుండా అడుగువేసి బ్రతకలేని పరిస్దితి ప్రపంచంలో దాపురించింది.. మరోవైపు కరోనా ఆగిపోకుండా అందరిని ఒక చూపుచూస్తుంది.. దీని బారిన ఇప్పటికే వైద్య సిబ్బంది, పోలీసులు, రాజకీయ నాయకులతో పాటుగా ఇతరులు కూడా భారీగానే పడి బలవుతున్నారు..

 

 

ఇక శానిటైజర్ విషయంలో అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు కానీ, ఈ క్రమంలో మార్కెట్లో లభించే నకిలీ శానిటైజర్ల వల్ల కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా దీంతో పాటు మనుషులు వాడేసిన మాస్క్‌ల వల్ల పర్యావరణానికే కాదు, సముద్రంలో నివసించే సకల జీవ జాతులకు విపరీతంగా హాని కలిగిస్తున్నాయట.. ఇంతకాలం ప్లాస్టిక్‌తో జలచరాలకు ప్రమాదం ఉండేది కానీ, తాజాగా మాస్క్‌లతో కూడా ఈ ప్రాణులకు హాని కలుగుతుందని గుర్తించారు. ఇక లోకంలోని ప్రజలు కరోనావైరస్ అనే మహమ్మారితో పోరాడుతుండగా, మరోవైపు ఆ పోరాటానికి ఉపయోగిస్తున్న మాస్కులు, గ్లవ్స్, పీపీఈ కిట్లు వంటివి సముద్రాల్లోకి విపరితంగా వస్తున్నాయి. ఎంతలా అంటే ప్రతి నెలా 12900 కోట్ల ఫేస్ మాస్కులను, 6500 కోట్ల ప్లాస్టిక్ గ్లవ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఓషియన్ కన్జర్వెన్సీ చెబుతోంది.

 

 

కాగా ఇలా వాడిపారేసిన ఈ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యావరణ పరిరక్షకులు, పర్యవేక్షకులు సముద్ర మట్టంలో కనుగొని, బయటకు తీస్తున్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే సముద్రంలోని జీవ జాతులకు ఇబ్బందులు తప్పవని, వీటి వల్ల అవి ప్రమాదంలో పడొచ్చని వారు చెబుతున్నారు. అంతే కాదు ఇలా వచ్చే మాస్కులతో తిమింగళాలు వంటి పెద్ద ప్రాణులు కూడా మరణించే అవకాశాలు చాలా ఉన్నాయట.. ఇక చిన్న జీవుల సంగతి అయితే చెప్పక్కర లేదు.. ప్లాస్టిక్ వాడొద్దంటే ఊరుకున్నారు ప్రజలు కానీ, మాస్కులు వాడొద్దనే పరిస్దితులు లేవు.. అందుకే పర్యావరణానికి, అందులోని ప్రాణులకు హాని జరుగకుండా మరో మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: