రోజు రోజుకు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న సమస్య కరోనా.. దీని విలనిజం భయంకరంగా, భరించలేని విధంగా ఉంది. ఈ వైరస్‌తోనే ప్రజలు సతమతం అవుతుంటే ఈ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా భరించలేని మరిన్నిసమస్యలు మనుషుల జీవితాలను చుట్టు ముడుతు ఉన్నాయట. ఈ వైరస్‌ను మొదట్లో తెలికగా తీసుకున్న వారందరికి ఇది ప్రస్తుతం విశ్వరూపాన్ని చూపిస్తుంది.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో గట్టిగా పాతుకు పోయినా ఈ వైరస్‌ను వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా చాలా కాలం వరకు అంత మొందించడం అంత ఈజీ కాదు.. అదీగాక ఊసరవెళ్లి రంగులు మార్చినట్లుగా ఇది కూడా ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా విస్తరిస్తూ పరిశోధకులను కూడా పరెషాన్ చేస్తుంది..

 

 

ఇకపోతే కరోనాతో ఇప్పటికే నరకాన్ని చూస్తున్న వారికి మరో ముప్పు పొంచి ఉందని లండన్ పరిశోధకులు బాంబు పేల్చారు. తాజాగా కరోనా బారినపడిన రోగుల్లో పలు రకాల సమస్యలను గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ఇక కరోనా వచ్చిన వారిలో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత, మానసిక సమస్యలను కరోనా భారీగా ప్రభావితం చేసిందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. అదీగాక పలువురు పరిశోధకులు ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం మెదడువాపు, గందరగోళం, స్ట్రోక్, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించ వచ్చని తెలిపారు.

 

 

ఇక ఈ విషయంలో లివర్‌పూల్ విశ్వవిద్యాలయం అధ్యయన వేత్త సుజన్నా లాంత్ మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలకు దాదాపు వెయ్యి మంది రోగులు గురయ్యారు. ఇది అరుదుగా కనిపించే సమస్య అయినప్పటికీ, ప్రధానంగా బాధితుల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యం అని వివరించారు. అయితే ఇదే విషయంలో అవా ఈస్టన్ అనే మరో శాస్త్రవేత్త మాట్లాడుతూ. ఇప్పటి వరకు దీనిపై సమగ్ర వివరాలు అందలేదు, అందుకని ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  డేటాను  సమీక్షించాల్సి ఉంటుందని తెలిపారు.

 

 

కాగా మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్‌ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోందనే విషయాన్ని ఇటీవల ‘బ్రెయిన్‌’ పత్రికలో వెల్లడించారట.. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలీరియం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టంగా తెలిపిందట.. ఇలా రోజు రోజుకు కరోనా గురించి కొత్త కొత్త విషయాలు వింటుంటే ఈ వైరస్‌తో ఏమో గానీ భయంతోనే ప్రజలు పోయేలా ఉన్నారు.. ఇక ఏది ఏమైనా ఈ కష్టాన్ని అనుభవించక తప్పని పరిస్దితులు నెలకొన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: