చైనా దేశం మొన్నటి వరకు వెరైటీ వస్తువులు.. వెరైటీ తిండి అనుకున్నాం.. ఇప్పుడు వెరైటీ వైరస్ విషయంలో కూడా ముందున్నారు.  చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టేసి కకా వికలం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,78,854  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,56,601 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,22,825 కరోనా కేసులు రికార్డయ్యాయి. ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది అమెరికా.. ఇప్పటివరకు మొత్తం 3,21,19,999 మంది కరోనాబారిన పడ్డారు.

 

దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 16,57,749 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు. గురువారం కొత్తగా 960 మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 1,35,822కు చేరింది. ప్రపంచంలో కరోనా పుణ్యమా అని ఎవరూ బయట రావడానికి భయపడిపోతున్నారు. ఇక కొన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీంతో సామూహిక భోజనాలు, వీకెండ్ లంచ్ మీటింగ్‌లు అన్నీ పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కరోనాకి వ్యాక్సిన్ కనుగొనలేదు. ఇక కరోనాకు బయపడి అన్ని వ్యవస్థలు మూసి వేస్తే లక్షల కోట్లు ఆర్థిక నష్టాలు వస్తాయని భావించి...  మినహాయింపులతో మెల్లమెల్లగా వ్యాపార సముదాయాలు తెరుచుకుంటున్నాయి.

 

ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.  ఇక్కడ హోటల్స్ తెరిచినా ప్రజల నుంచి పెద్దగా ఆధరణ లేకపోవడంతో యజమానులు అల్లాడిపోతున్నారు. దీంతో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ హోటల్స్‌లో భోజనం చేసినా కేవలం 50 శాతం మాత్రం బిల్లు చెల్లించాలని ఆఫర్ ఇచ్చింది. ఆగస్టు నెల మొత్తం ఈ ఆఫర్ ఉంటుందని బ్రిటన్ ఛాన్సలర్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ బ్రిటన్‌లోని 1,29,000 కేఫ్‌లు, రెస్టారెంట్లలో చెల్లుబాటు అవుతుందని తెలిపారు. మాస్కులు, ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. ఆయా హోటళ్లకు వచ్చి భోజనం చేసి బంపర్ ఆఫర్ పొందాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: