కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక దశలో ఆయనకు కరోనా వైరస్ సోకింది అని, అందుకే ఆయన రహస్యంగా చికిత్స చేయించుకుంటున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. మరి కొందరు కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని, అక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నారనే రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా తెలంగాణ ప్రతిపక్షాలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలాకాలంగా కనిపించడం లేదంటూ, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటూ, హైకోర్టులో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

IHG

ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తో రాజకీయ జిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరించింది. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి పై రకరకాల పుకార్లు వస్తున్నాయి అని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో  తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అందుకే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి చెప్పాలంటూ, నవీన్ పిటిషన్ లో కోరారు. దీనిని అత్యవసరంగా విచారించాలని నవీన్ కోరడంతో హైకోర్టు ఆక్షేపించింది. ఈ పిటిషన్ అత్యవసరం గా విచారించే ప్రశ్నే లేదని, ముఖ్యమంత్రి కనిపించకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని, సూచించింది. కెసిఆర్ ఎక్కడున్నారు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఆయన రైతులతో మాట్లాడినట్లుగా రకరకాల ప్రచారాలు మీడియాలో వస్తున్నాయి.

 

కెసిఆర్ ఫార్మ్ హౌస్ లోనే ఉన్నారని, అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులు చెబుతుండగా, ప్రస్తుతం తెలంగాణ పాత సెక్రటరీ భవన్ కూల్చుతున్న నేపథ్యంలో ఆ వ్యవహారం పూర్తిగా ముగిసిన తర్వాత కేసీఆర్ బయటకు వస్తారనే ప్రచారం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: