గత 70 రోజులుగా చైనా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లడఖ్ లోని ఘర్షణాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లిపోయాయి. శిబిరాలను తొలగించడంతో పాటు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. 
 
ఆదివారం రోజున భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి మధ్య జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాలు సైనిక బలగాలను వెనక్కు తీసుకున్నాయి. ఏ మేరకు ఉపసంహరణ జరిగిందనే విషయాన్ని భారత బలగాలు త్వరలో నిర్ధారించుకోనున్నాయి. అయితే చైనా గతంలో వేసిన ఎత్తులే ఇప్పుడు కూడా వేస్తోందని తెలుస్తోంది. పాంగ్ వాన్ సరస్సు దగ్గర మాత్రం చైనా సైనికులు ఇంకా తిష్ట వేశారని తెలుస్తోంది. 
 
చైనా సైన్యం అక్కడ ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 దగ్గరకు వెళ్లాల్సి ఉన్నా ఫింగర్ 5 దగ్గరే ఆగిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో చైనా రిజర్వాయర్ కట్టుకోవాలని ప్రయత్నించగా భారత్ ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. భారత్ తన భూభాగంలో వంతెన నిర్మించుకొంది. భారత్ ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. అయితే చైనా మాత్రం ఆ నిర్మాణాలు భారత్ తొలగించాలని కోరుతోంది. 
 
భారత్ మాత్రం మా భూభాగంలోని నిర్మాణాలను తొలగించమని చెప్పే అధికారం చైనాకు లేదని... కార్గిల్ యుద్ధం సమయంలో మా భుభాగాన్ని చైనా కబ్జా చేసిందని భారత్ చెబుతోంది. దీంతో పాంగ్ వాన్ సరస్సు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల దగ్గర చైనా బలగాలు వెనక్కు వెళ్లినా ఈ ప్రాంతం దగ్గర వెనక్కు వెళ్లకపోవడంతో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: