తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటం, ఇదే సమయంలో సీఎం కేసీఆర్ బయటకురాకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కనిపించడం లేదని, ఆయనలో కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో సచివాలయం కూల్చివేత కార్యక్రమం కూడా జరుగుతుండటంతో ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో గులాబీ పార్టీపై విరుచుకుపడుతున్నారు.

 

అయితే ఇంతా జరుగుతున్నా కూడా టీఆర్ఎస్ నేతలు పెద్దగా కౌంటర్లు ఇచ్చే కార్యక్రమం చేయడం లేదు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా ఉన్నా, నెక్స్ట్ మాత్రం టీఆర్ఎస్ పగ్గాలతో పాటు, సీఎం పీఠం కేటీఆర్ చేతిల్లోకి రానుందని, అందుకే కేసీఆర్ కాస్త నిదానిస్తున్నారని కొన్ని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

 

నెక్స్ట్ ఎన్నికల వచ్చేవరకు కేసీఆర్ సీఎంగా ఉండటం ఖాయమని, కానీ ఆ తర్వాత మాత్రం లీడ్ తీసుకునేది కేటీఆర్ అని అందులో ఎలాంటి అనుమానం లేదని విశ్లేషుకులు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ సలహాలకే పరిమితమయ్యారని, యాక్షన్ ప్లాన్ అంతా కేటీఆర్ చూసుకుంటున్నారని అంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కేటీఆర్ కోసం కేసీఆర్ గ్రౌండ్ రెడీ చేసి పెడుతున్నారని తెలుస్తోంది.

 

అయితే టీఆర్ఎస్ తరుపున లీడింగ్ కేటీఆర్ తీసుకుంటే, ఆయనకు అపోజిట్‌లో పోటీ ఇచ్చేది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డినే. కానీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు, సీనియర్ నేతల పెత్తనంతో రేవంత్‌కు పెద్దగా లీడ్ తీసుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది. కాకపోతే టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వగలిగేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ ఉన్నా సరే ఆ పార్టీకి కింది స్థాయిలో కేడర్ బలంగా లేదు. ఇక కాంగ్రెస్‌లో ఏమో లుకలుకలు ఎక్కువ, దాని వల్ల ఆ పార్టీ ఇంకా దిగజారిపోతుంది. అలా కాకుండా రేవంత్ రెడ్డికి లీడింగ్ ఛాన్స్ ఇస్తే, కాస్త కేటీఆర్‌కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: