కరోనా టెస్టుల విషయంలో హై కోర్టుతో పాటు ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు మేల్కొంది. గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో టెస్టుల సంఖ్య స్వల్పంగా పెరగగా ఈరోజు మాత్రం ఆసంఖ్య భారీగా పెరిగింది. ఈఒక్క రోజే 10354 శాంపిల్ టెస్టులు జరిగాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక్కడ హర్షించ దగ్గ విషయం ఏటంటే ఇన్నివేల టెస్టుల్లో కేవలం1278 పాజిటివ్ కేసులు నమోదకావడం.. అందులో అత్యధికంగా జిహెచ్ఎంసి లో 762, మేడ్చల్ లో 85, రంగారెడ్డిలో 171కేసులు బయటపడ్డాయి.ఈరోజు కరోనాతో 8మంది మృతి చెందారు. ఈకొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 32224కు చేరగా అందులో 19205మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం12680కేసులు యాక్టీవ్ గా ఉండగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 338కి చేరింది.     
 
 
 
ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు కూడా దేశంలో భారీగా కేసులు నమోదయ్యాయి అందులో అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే ఈరోజు 7862 కేసులు నమోదుకావడం గమనార్హం. ఓవరాల్ గా కలిపి ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 800000 దాటింది అయితే ఇందులో 500000 మంది బాధితులు కోలుకోవడం ఊరటనిచ్చే విషయం కాగా ఇప్పటివరకు 22000 కరోనా మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: