ఒక నమ్మకం వంద ఏనుగుల బలాన్ని ఇస్తే.. అపనమ్మకం బ్రతికి ఉండగానే చంపేస్తుంది.. రేసులో పాల్గొన్నప్పుడు రక్తాలు కారుతున్నా అవేవి లెక్కచేయకుండా చివరి వరకు పరిగెత్తి గెలిచిన వాడే విజేతగా ప్రకటించబడుతాడు.. ఈ రెండు విషయాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కరోనా విషయంలో తెలంగాణ ప్రజల్లో నెలకొన్న భయం, ఏపి ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పోరుకు సంబంధించిన విషయాలు గమనిస్తే.. తెలంగాణాకు ముఖ్యనగరం అయినా హైదరాబాద్ అంటే ఇప్పుడు ప్రతివారు హడలిపోతున్నారు.. ఒకప్పుడు సిటీ నుండి వచ్చాం అంటే గౌరవంగా చూసిన కన్నులే ఇప్పుడు అనుమాన పడుతున్నాయి.

 

 

హైదరాబాద్ నుండి సొంత రాష్ట్రాలకు వెళ్లేవారి పరిస్దితి గజదొంగల కంటే ఘోరంగా మారింది.. అదీ గాక ఈ మధ్య కాలంలో నగరం ఎడారిలాగా కనిపిస్తోంది సిటీని వదిలి అన్ని లక్షల మంది వెళ్లిపోయారు ఇన్ని లక్షల మంది వెళ్లిపోయారు అనే విపరీత ప్రచారం జరుగుతుంది.. అయితే ఈ వార్త సంపూర్ణ వాస్తవం కాకపోవచ్చు. కానీ ఇక్కడి పరిస్దితులు సవ్యంగా లేని మాట నిజం. రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఓ వైపున తెలంగాణ ప్రభుత్వం గాంధీలో వెయ్యికి పైగా బెడ్లు ఖాళీ ఉన్నాయని చెపుతున్నా ఈ భయమూ, పానిక్ వాతావరణమూ హైదరాబాద్‌లో ఎందుకు వ్యాపిస్తోంది..

 

 

అలాగే తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ఈ కోవిడ్ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొంటుందనే విషయాన్ని పరిశీలిస్తే.. తెలంగాణాలో అంటే, ముఖ్యంగా హైదరాబాద్‌లో పర్సెప్షన్, ఇమేజ్, కొన్ని ప్రాక్టికల్ మేనేజ్ మెంట్ ఇష్యూస్ కారణం అని చెప్పుకోవచ్చు. అదీగాక ఇక్కడి కరోనా రోగులకు భరోసా అనేది లభించడం లేదు.. ఇక భయం అన్నింటికన్నా పెద్ద రోగం. సైకలాజికల్‌గా, వీక్‌గా ఉన్న టైంలో ఇలాంటి అనుభవం ఎదురైతే భరోసా ఎక్కడి నుంచి వస్తుంది. అదీగాక ప్రైవేట్ ఆస్పత్రులన్ని బిజినెస్ టైకున్‌గా ఎదిగాయి.. అసలే ప్రాణభయంతో అల్లాడుతున్న మనిషి వరుసగా ఒక్కో ఆస్పత్రి తలుపు తడుతూ వాళ్లెవరూ చేర్చుకోక పోతే అతను లేదా ఆమె పరిస్థితి, వాళ్ల బంధువుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.

 

 

పోనీ కనీసం గాంధీ హస్పిటల్‌కు అయినా వెళ్లుదాం అనుకుంటే అంబులెన్స్ సత్వరం అందుబాటులో ఉండదు. దగ్గరున్న ప్రైవేట్ ఆస్పత్రికి పోతే చేర్చుకోరు.. ఇలా జరిగిన సమయంలో రోగిలో నెలకొన్న నిస్సహాయత భయానకమైనది. మరొక ఆప్షన్ కూడా అందుబాటులో లేకుండా పోవడం అనేది అన్యాయమైన పరిస్థితి ఇప్పుడు తెలంగాణాలో నెలకొంది.. అందుకే తెలంగాణ ప్రభుత్వం అస్సలు ఇంత ఖర్చుపెడుతున్నా ఇంతమంది వైద్య సిబ్బంది కృషి చేస్తున్నా జనంలో మనమెందుకు భరోసా కల్పించలేకపోతున్నాం అనేది ఆలోచించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి..

 

 

ఇకపోతే ఆంధ్రాలో కొన్ని ప్రైవేట్ ఫెసిలిటీస్‌ని కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించడం వల్ల జనానికి ఆప్షన్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. అదీగాక ఏపీలో రోగులకు ఛాయిస్ ఉండగా, ఇంత పెద్ద హైదరాబాద్‌కు ఒక్క గాంధీనే దిక్కుగా మారింది.. అయితే విజయవాడ లాంటి చిన్న నగరంలో కూడా దాదాపుగా 8 చోట్ల రోగులు అడ్మిట్ కావడానికి ఆస్కారం ఉంది. అందులో ఐదు ప్రభుత్వ ఆస్పత్రులు, మూడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు. అయితే, ఏపీలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నా, హైదరాబాద్ లాంటి పరిస్థితి అయితే లేదు. రెండు చోట్లా పోల్చి చూస్తే ఆంధ్రాలో మేనేజ్మెంట్ బెటర్‌గా ఉండటమే కాదు కరోనా రోగులకు భరోసా ఇవ్వడంలో తెలంగాణ కంటే ఆంధ్రా ముందుంది..

 

 

ఇక కరోనా వ్యాపించిన తొలి దశలో కేసీఆర్ స్పందించిన తీరుకు, ఇవాళ తెలంగాణ ఆరోగ్య శాఖ స్పందిస్తున్న తీరుకు పొంతన లేదు. తొలిదశలో కేసీఆర్ విజనరీలాగా మాట్లాడారు. అంతులేని భరోసా ఇచ్చారు. అప్పుడు జాగ్రత్తల్లో, ఏర్పాట్లలో దేశంలోనే తెలంగాణ ముందుంటుందేమో అన్నట్టు ఇమేజ్ వచ్చింది. అది కాస్తా ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారి పోయింది.

 

 

అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు చేస్తున్న ఆలోచన ఏంటంటే సంక్షేమంలో టాప్ గేర్లో ఉన్న తెలంగాణ, దేశానికి రైతు బంధు లాంటి పథకాన్ని మోడల్‌గా అప్పగించిన తెలంగాణ, ఖర్చుకు వెనుకాడని తెలంగాణ, కల్నల్ కుటుంబానికి ఐదుకోట్లు ప్రకటించగల ఉదారత్వం ఉన్న తెలంగాణ, సంపన్న రాష్టం తెలంగాణ.. కోవిడ్ విషయంలో ఇంకాస్త ఉదారంగా ఆలోచిస్తే బాగుండునని అనుకుంటున్నారట.. ఏది ఏమైనా చివరి వరకు గెలుపు విషయంలో తెలంగాణ తడబడింది అనేది ఇక్కడ సృష్టంగా అర్ధం అవుతుందని అంటున్నారట విశ్లేషకులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: