ఈ మాయదారి కరోనా వల్ల మనిషి బంధాలు.. అనుబంధాలు పూర్తిగా మర్చిపోతున్నారు. తమ చుట్టు ఏదో జరుగుతుందని.. తాము వైరస్ తో చనిపోతామని భయంతో వణికిపోతున్నారు. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. అతన్ని నుంచి దూరం వెళ్లడమే కాదు ఓ రోగిగా పరిగణిస్తున్నారు.  ఇక కరోనాతో మరణించిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని చోట్ల జేసీబీతో పూడ్చూతున్నారు.. ఒక చోట చెత్త బండిలో మృతుడిని తరలించారు.. రోడ్డు పక్కన విసిరివేసి వెళ్తున్నారు.  కొన్ని గ్రామాల్లో అయితే కరోనా పేషెంట్స్ ని బహిష్కరిస్తున్నారు.. చనిపోతే కనీసం ఖననం చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. 

 

మొన్నటి వరకు మనం భారతీయులం.. మనందరం అన్నదమ్ములం.. అక్కచెల్లెలం అన్నవారు ఇప్పుడు కరోనా పేరు చెబితో పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో 19 ఏళ్ల ఓ యువతిని కరోనా అనుమానంతో బస్సులో నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన అన్షిక యాదవ్ (19) జూన్ 15న తన తల్లితో కలిసి ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరింది. బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కొంతమంది అనుమానాలు వ్యక్తంచేశారు.

 

ఆమెను వెంటనే బస్సులో నుంచి దింపేయాలని డ్రైవర్, కండక్టర్‌ను కోరారు.  అలాంటిది ఏమీ లేదని.. తన బిడ్డ బాగానే ఉందని తల్లి చెబుతున్నా వినిపించుకోలేదు. ప్రయాణికులు అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందకి దింపే ప్రయత్నం చేశారు.  అన్షిక ప్రతిఘటించడంతో కిందకు తోసేశారు. రోడ్డుపై పడిపోయిన యువతి అరగంట తర్వాత మృతిచెందింది. ఢిల్లీ-యూపీ యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపించాలని మథుర ఎస్‌ఎస్పీ గౌరవ్ గ్రోవర్‌ను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: