ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జూన్ 14న బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డ విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ దేశంలో ప్రబలిపోతుందన్న విషయంపై కేంద్రం దృష్టి పెట్టింది. దాంతో మార్చి నెలలో లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ పూర్తిగా మూతపడిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది నటులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇక బాలీవుడ్ లో బంధు ప్రీతి ఉందని.. గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఎలాంటి ఛాన్సులు రావడంలేదన్న కారణంగా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆవేదనకు గురియ్యాడట.  

 

ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన జ్ఞాప‌కాల ద్వారా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సుశాంత్ లాంటి మంచి వ్య‌క్తి మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న జ్ఞాప‌కంగా బీహార్‌లోని పర్నియాలో ఓ ర‌హ‌దారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టుకున్నాం అని మేయ‌ర్ స‌రితా దేవి తెలిపారు. సుశాంత్‌కి బీహార్‌లో అభిమానులు చాలా ఎక్కువే. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తట్టుకోలేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడ్డ విషయం తెలిసిందే.

 

ఇక్క అభిమానులు ఆయ‌న‌ని ఎంత‌గానో ప్రేమించే బీహారీలు ఆయ‌న జ్ఞాప‌కంగా రోడ్డుకి సుశాంత్ పేరు పెట్టుకున్నారు. మధుబని నుంచి మాతా చౌక్‌కు వెళ్లే రహదారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చౌక్ అని నామ‌క‌ర‌ణం చేయ‌గా, ఇలా వీధికి ఆయ‌న పేరు పెట్ట‌డం ఘ‌న నివాళి అర్పించ‌న‌ట్లు అవుతుంద‌ని మేయ‌ర్ స్ప‌ష్టం చేశారు. సుశాంత్ చివ‌రిగా దిల్ బెచారా అనే చిత్రంలో న‌టించ‌గా, ఈ సినిమా జూలై 24న ఓటీటీలో విడుద‌ల కానుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: