రాజకీయ చాణిక్యుడు గా పేరు పొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణలో రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. కరోనా తెలంగాణ ఈ స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కేసీఆర్ ఎవరికి అందుబాటులో లేకుండా, పూర్తిగా అజ్ఞాతంలో ఉండడం, అసలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో తెలియక తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో కరోనా ఉదృతం అవ్వడం, ఆ వైరస్ ప్రభావానికి గురైన వారు చికిత్స పొందే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఈ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు చక్కబెడుతూ అధికారులకు మార్గ నిర్దేశకం చేస్తూ, ప్రజల్లో ధైర్యం నింపే విధంగా వ్యవహరించాల్సి ఉన్నా కెసిఆర్ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా పూర్తిగా మౌనం వహిస్తుండడంతో ఆయనపై విమర్శలు పెరిగిపోతున్నాయి.

IHG

సోషల్ మీడియాలో కేసీఆర్ ఎక్కడ అంటూ యాష్ టాగ్ తో విమర్శలు పెద్దఎత్తున చేస్తున్నారు. ఇదే అవకాశంగా కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు సైతం కేసీఆర్ తీరును విమర్శిస్తూ, మైలేజ్ పెంచుకునే విధంగా, వ్యవహారాలు చేస్తూ వస్తున్నాయి. ప్రజల్లోనూ కేసీఆర్ తీరుపై విమర్శలు పెరిగిపోతుండడంతో, త్వరలోనే ఆయన జనాల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ శ్రేణులు మధ్య జరుగుతున్న సంభాషణ. మరో మూడు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ప్రజలకు భరోసా కల్పించే విధంగా నిర్ణయాలు ప్రకటించడంతో పాటు, ఇప్పటి వరకు తన పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చిన రాజకీయ ప్రత్యర్థులకు కూడా గట్టి సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

IHG's condition is stable, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a> moots several steps ...

గతంలోనూ ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ఇదేవిధంగా వ్యవహరించి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అకస్మాత్తుగా వారికి వరాలు ప్రకటించి ఆర్టీసీ కార్మికులలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోరాటానికి దిగిన కార్మిక సంఘాల ఊసే ఆర్టీసీ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు కరోనా వ్యవహారంలో తనపై వస్తున్న విమర్శల విషయంలోనూ అదే తరహాలో కెసిఆర్ వ్యవహరించి, ప్రత్యర్థులకు సమాధానం చెప్పే విధంగా ఆయన ప్లాన్ చేసుకుని మీడియా ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: