ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు  చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూశారు.. ఆ మరుసటి రోజే బాలీవుడ్ దిగ్గజం రిషీ కపూర్ కన్నుమూశారు. ఈ విషాదాలు మరువక ముందో ‘దోనీ’ ఫేమ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఎన్నో కథనాలు వెలుగు లోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా సుశాంత్ డిప్రేషన్ లో ఉన్నాడని.. బాలీవుడ్ లో బంధు ప్రీతి వల్ల యువ హీరోలకు సినిమా ఛాన్స్ లు రావడం లేదన్న టాక్ వినిపిస్తుంది... ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా సుశాంత్ ని పక్కన బెట్టడంతో ఆవేదనకు గురైనట్లు సహనటులు అంటున్నారు.

 

తాజాగా బాలీవుడ్ నటులపై సంచలన నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు.  ఆత్మహత్య అని చెబుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదంతం తర్వాత బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మౌనం దాల్చిందా? అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ లో ప్రశ్నించారు.  ఈ ముగ్గురు భారత్ లోనూ, విదేశాల్లోనూ వెనుకేసుకున్న ఆస్తులపై విచారణ జరపాలి.

 

ముఖ్యంగా, వారికి దుబాయ్ లో ఉన్న ఆస్తులపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ వారికి బంగ్లాలు, స్థిరాస్తులు ఎవరు బహూకరించారో, ఎలా కొన్నారో తేలాలి. దీనివెనుక ఉన్న వ్యవస్థ ఏమిటో సిట్, ఈడీ, ఐటీ, సీబీఐ విచారణ జరిపి నిగ్గు తేల్చాలి. వారేమన్నా చట్టానికి అతీతులా? అంటూ నిలదీశారు. తాజాగా సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: