తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగినంతవరకూ దేశంలోనే అతి తక్కువ కేసులు నమోదవుతున్న  రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ చాపకింద నీరులా పాకిపోతోంది. ఈ నేపథ్యంలో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్ని కరోనా  రోగులతో నిండిపోగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనా  రోగులతో ఫుల్ గా కనిపిస్తున్నాయి, రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.


అయితే ఈ మహమ్మారి వైరస్ కారణంగా సామాన్య ప్రజలే కాదు అధికారులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం మృత్యువుతో పోరాడాల్సిన  దుస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడటం... ప్రజాప్రతినిధులు సైతం ఈ వైరస్ బారినపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇక సినీ పరిశ్రమను కూడా కరోనా  రక్కసి కదిలించింది. సామాన్య ప్రజల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేనిది. ఇక ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ రంగంలో కూడా కరోనా వైరస్ కేసులు బయటపడటం అందరిని కలవరానికి గురిచేస్తోంది.



ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ లలో  కరోనా వైరస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగులు కూడా ఎంతగానో కలవరపడుతున్నారు. ఎందుకంటే ఓ వైపు తమ సహోద్యోగులు, రోజు  బ్యాంకుకు  వచ్చి పోయే కస్టమర్ల  నుంచి కూడా కరోనా  వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున ప్రస్తుతం భయంతో వణికిపోతునే ఉద్యోగాలు చేస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు.కాగా  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 80మంది కరోనా  వైరస్ బారిన పడటం సంచలనం గా మారిపోయింది. ఇక కరోనా  భయానికి ఏకంగా పది బ్రాంచీలను సైతం మూసి వేయాల్సిన దుస్థితి వచ్చింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: