దేశంలో మార్చి 24 న లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి రవాణా వ్యవస్థ, హూటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్స్, సినిమా షూటింగ్ అన్నీ వాయిదా పడ్డాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తరువాత కొన్ని నిబంధనలు పాటిస్తూ నెమ్మది నెమ్మది హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి.  ఇటీవల బ్రిటన్ లో మాస్క్ లు పెట్టుకుని..భౌతిక దూరం పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యజమానులు కష్టమర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అంతే కాదు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఎవరూ హోటల్స్‌లో భోజనం చేసినా కేవలం 50 శాతం మాత్రం బిల్లు చెల్లించవచ్చు..దానికి ఆయా యజమానులకు ప్రభుత్వం నుంచి ట్యాక్స్ వసూలు రాయితీలు ఉంటాయని ప్రకటించింది.

 

ఈ ఆఫర్ ఉంటుందని బుధవారం (జూలై 8,2020) బ్రిటన్ పార్లమెంట్ అత్యవసర మినీ బడ్జెట్‌లో సమావేశంలో మంత్రి రిషి సునక్ తెలిపారు. తాజాగా మన దేశంలో కూడా ఇలాంటి ఆఫర్లే పెడుతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశంలోని చాలా పెద్ద హోటళ్ళ గ్రూపు అయిన ఐటీసీ.. తమ కస్టమర్లను ఆకర్షించడానికి.. సేవ్ నౌ, స్టే లేటర్ అనే పథకాన్ని కూడా తీసుకువచ్చింది. పర్యాటకులు, అతిథులు 2021 జూన్ వరకు ఏ రోజులోనైనా హోటల్ బుక్ చేసుకోవచ్చు, చెల్లింపు ముందస్తుగానే చెల్లించాలి.

 

అయితే 2021 జూన్ లో కస్టమర్లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులకు 30 శాతం వరకు బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. మారియట్ హోటల్ కూడా ఇలాంటి పథకాన్నే తీసుకొచ్చింది. ఇందులో రెండు రాత్రులు బుక్ చేసుకునే వినియోగదారులు ఒక రాత్రికి మాత్రమే డబ్బు చెల్లించాలి. అలాగే, 2 రాత్రులు, 3 రోజులు బుక్ చేసుకునే వారు కూడా ఒక రాత్రికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడానికి ఇలాంటి తిప్పలు పడక తప్పవేమో  హోటళ్ళు కూడా విభిన్న ఆఫర్లతో కస్టమర్లను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: