వైయస్ జగన్ ఏడాది పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కొన్నిచోట్ల దుబారా ఖర్చు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైయస్ జగన్ తనకు సలహాదారులుగా ఇప్పటిదాకా దాదాపు 33 మందిని నియమించుకున్నారు అని వాళ్లకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారని చేసే పని ఏమి ఉండదని విపక్షాలు అంటున్నాయి. ఇటీవల ఒక్కసారిగా వైయస్ జగన్ చుట్టూ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వాళ్లు చాలామంది మారడం జరిగింది. వాళ్ళ స్థానాలలో వేరే వాళ్ళు రావడం జరిగింది. అయినా గాని ఎక్కువగా అందరి పని చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమేనని మిగతా వారికి ఊరికనే పదవులు కట్టబెట్టి ప్రజాధనాన్ని జీతాల రూపంలో లక్షల్లో వైఎస్ జగన్ ఇస్తున్నారని చేసే పని కూడా పెద్దగా ఏమీ ఉండదని అంటున్నారు.

 

కేవలం ప్రభుత్వ సలహాదారుడకి మాత్రమే కాకుండా వాళ్ళకి డ్రైవర్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ వాళ్లకి కూడా ప్రభుత్వమే జీతాలు అందిస్తుందని ఇదంతా దుబారా ఖర్చు అంటూ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు పెద్ద చిల్లు అంటూ విపక్షాలు జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నయి. అంతేకాకుండా కేబినెట్ ర్యాంక్ లేని.. సలహాదారులు.. అలాగే సహాయ సలహాదారులు కూడా 23మంది వరకూ ఉన్నారు. వారికి కేబినెట్ ర్యాంక్ ఉన్న వారితో సమానంగా జీతభత్యాలు ఇవ్వటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

 

వీళ్లంతా గతంలో వైసీపీకి ఏదో రూపంలో సహాయం చేయడంతో వారిని అలాగా ప్రభుత్వ వ్యవస్థలో జగన్ తీసుకొచ్చినట్లు ప్రజాధనాన్ని అనవసరంగా వారికి జీతాలుగా ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. పైగా వీళ్ళు ఇచ్చే సలహాలు ఏమైనా బాగున్నాయా అంటే న్యాయస్థానంలో వచ్చేసరికి ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. అలాంటప్పుడు వీరికి అంతా అంతా లక్షల్లో జీతాలు ఇవ్వటమేంటి అని అంటున్నారు. పైకి ప్రభుత్వం చాలా పొదుపుగా ఖర్చు చేస్తుందని చెబుతున్న వైఎస్ జగన్ సర్కార్ చాల ప్రజా దానం వేస్ట్ చేస్తుందని విపక్షాలు ఈ విధంగా కౌంటర్ లు వేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: