ఏదైనా చేయాలనే ఉత్సాహం, చురుకుదనం, ఆసక్తి ఉన్న వారికి కాస్త ఊతం లభిస్తే మరింత దూకుడుగా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు అటువంటి ఊతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర బిజెపి పెద్దల నుంచి లభిస్తుంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా తెలంగాణ గడ్డపై రెపరెపలాడించాలని, దానికి ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు తెలుపుతామని బీజేపీ పెద్దలు సంకేతాలు ఇవ్వడంతో, ఆయన అధ్యక్ష పీఠంపై కూర్చున్న అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ ని పరుగులు పెట్టిస్తున్నారు. బిజెపి తెలంగాణలో బలపడేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా, దానిని వదిలిపెట్టకుండా సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, పార్టీకి మైలేజ్ తీసుకొస్తున్నారు బండి సంజయ్.

IHG

 గతం కంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణ బాగా బలపడిన ట్టుగా కనిపిస్తోంది. దీనికి కారణం బండి సంజయ్ చురుకుదనం కారణంగా కనిపిస్తోంది. గతం కంటే మరింత ఉత్సాహంగా పని చేస్తూ, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో ఆయన చూపిస్తున్న చొరవ మిగతా నాయకులు కూడా ఆదర్శంగా ఉండటంతో, మొత్తం పార్టీలోని నాయకులు అంతా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తోపాటు, అధికార పార్టీ హవా తగ్గించే విధంగా చేయగలుగుతున్నారు.అలాగే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ నాయకులకు అన్ని జాగ్రత్తలు చెబుతూ పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆయన కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు.

IHG


 దీంతో మరింత చురుగ్గా కార్యక్రమాలు రూపొందించి, టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు.టిఆర్ఎస్ పై  పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే , పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, ఆయన ముందుకు వెళుతున్న తీరు కేంద్ర బీజేపీ పెద్దలకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి శాఖలో ఆయన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఈ తరహ మద్దతు రావడంతో బండి సంజయ్ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీలోని అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: