తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముందు ఉండడమే కాదు, రాజకీయ ప్రత్యర్థులను ర్యాగింగ్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా వైసీపీకి ముందు నుంచి ప్రధాన శత్రువుగాఉంది. టిడిపి,ఆ పార్టీతో పాటు కొన్ని మీడియా సంస్థలు వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి.

IHG

ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వైసీపీని విమర్శించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటూ వస్తోంది. తాజాగా ఆంధ్రజ్యోతిలో ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ రాసిన ప్రత్యేక వ్యాసం లో వైసీపీపైన ఆ పార్టీ అధినేత జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి తన ట్విట్టర్ ద్వారా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 " ఏంటి కిట్టు కేరాఫ్ ఆంధ్రజ్యోతి ?, రాజధాని వ్యవహారంలో బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తమరే చెప్తారా ? బిజెపికి మంచి పాలన అనుభవం ఉంది మీ ఉచిత సలహాలు ఏల ? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉన్నాయ్. అంతలా భయపడకు - మీ పార్ట్నర్ cbn కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగించు". అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే మరో ట్వీట్ లను రాధాకృష్ణపై ఇదే విధంగా విమర్శలు చేశారు. " ప్రధాని గారి మనసులో ఏముందో తొంగి చూస్తావు. 


జగన్ గారి ఆలోచన ఏంటో ఆరునెలల ముందే పసిగట్టేస్తావ్. వెర్రి గొర్రెల్లా జనం నమ్మేస్తారు అనుకున్నావా ? ఇది 21వ శతాబ్దం కిట్టప్పా c/o Andhra Jyothi. అప్పుడే ఎన్నికలంటూ ఎత్తుకున్నావేంటి ? అంటూ ట్విట్టర్లో విమర్శలు చేశారు. కేవలం రాధాకృష్ణ విషయంలోనే కాదు వైసీపీపై ఎవరు విమర్శలు చేసిన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారిపై వ్యంగ్యంగా వదిన పంచ్ డైలాగులతో విజయసాయిరెడ్డి విరుచుకుపడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: