దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, కోవిడ్-19 మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 2.46 లక్షల మందికి వైరస్ సోకగా.. 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  దేశంలో అధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటై మహారాష్ట్ర కోవిడ్ మరణాల్లో జర్మనీ (9,069), కెనడా (8,811) దేశాల కంటే ముందు వరుసలో ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తొలిసారి వెలుగుచూసిన చైనాలో కోవిడ్-19 మరణాలు (4,641) మహారాష్ట్రలో సగం ఉన్నాయి.  భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,637 మందికి కొత్తగా కరోనా సోకింది.

 

ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 8,49,553కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,674కి పెరిగింది. 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకున్నారు. ఇక ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా వారం రోజుల నుంచి అక్కడ  కేసుల పెరుగుదల తగ్గుముఖం పట్టింది.

 

దీంతో ధారావిలో కరోనాను కట్టడి చేయడానికి అధికారులు, వైద్యులు, ప్రజలు గొప్పగా పోరాడుతున్నారని ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ అధికారి ఒకరు  ప్రశంసలు కురిపించారు.   మొన్నటి వరకు దారావీ ప్రాంతంలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతూ వచ్చాయి.  ఈ మద్యనే తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. తాజాగా ధారావిలో గడిచిన 24గంటల్లో కేవలం 5 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,375కు చేరింది. అందులో 2016మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా కేవలం 113 మంది మాత్రమే దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దాదర్‌లో 38 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1168కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: