దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,49,553కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,674కి పెరిగింది. 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకున్నారు. గ్రామాల్లో కన్నా నగరాల్లో కరోనా ఎక్కువ వస్తుందన్న భయంతో గత నెల రోజుల నుంచి పట్టణాల్లో ఇళ్లు ఖాళీ చేసి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.  వాస్తవానికి మార్చి నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి పనులు లేక ఇంటి కిరాయిలు కట్టుకోలేక ప్రజలు ఎన్నో కష్టాల్లో పడ్డారు.  ఈ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్తూ వచ్చారు ప్రజలు.  ఎప్పుడైతే దేశంలో కరోనా కేసులు మొదలయ్యాయో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నగరాల్లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  కరోనా భయంతో వలసజీవులందరూ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

 

బతికి ఉంటే జీవితంలో ఏదైనా చేసుకొని బతక వొచ్చని.. పట్టణాల్లో ఉంటూ కరోనా భయంతో ప్రతిరోజూ గుండెలు చేతిలో పెట్టుకొని బతకడం కష్టమని ప్రజలు అనుకుంటున్నారు.  అందుకే ఉన్న ఊళ్లకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు.. కొంత మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. దాంతో పట్టణాల్లో టులేట్ బోర్డు లు పెడుతున్నారు. కరోనా రాని సమయంలో ఇంటి కిరాయి ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు పెట్టేవారు.. కానీ ఇప్పుడు కరోనా లేదని తెలిస్తే చాలు రెంటు కొంత తగ్గించి అయినా ఇస్తున్నారు. 

 

ఒకప్పుడు టు-లెట్ బోర్డు పెట్టిన కొద్ది వ్యవధిలోనే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చేరేవారు. ఇప్పుడు టు-లెట్ బోర్డు పెట్టి నెలలు గడుస్తున్నా ఒక్కరంటే ఒక్కరూ రాని పరిస్థితి ఏర్పడింది. సగానికి సగం అద్దెలు తగ్గిస్తామన్నా వచ్చేవారు కరవయ్యారు. అద్దె ఇళ్లు చూపించే బ్రోకర్లు కూడా ఈ పరిస్థితిలో కుదేలయ్యారు. హైదరాబాదులో రాబోయే రెండు నెలల్లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుందన్న ప్రచారంతో వారు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. హైదరాబాదులో ఇళ్ల యజమానులకు అద్దెలపై వచ్చే ఆదాయంలో గణనీయంగా కోతపడుతుంది. కరోనా ఎప్పుేడు పోతుందో అని బాధపడుతున్నారు ఇంటి యజమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: