కరోనా విజృంభిస్తున్న వేళ బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ తెరపైకి వచ్చింది. కోవిడ్ కేసులు మరింత ముదరడంతో, వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి 22 వరకు బెంగళూరు సిటీ,  రూరల్ ఏరియాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. 

 

లాక్ డౌన్ నిబంధనలను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ, రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.  వైరస్ వ్యాప్తిని మరింత అదుపు చేయాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 22 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు అర్భన్, రూరల్ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.  సర్కారు ప్రకటనతో ప్రజలు మరోసారి ఇంటికి పరిమితమవ్వనున్నారు.

 

కర్నాటకలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి, మళ్లీ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ప్రతి రోజు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు,  ఫలితాలను ఇవ్వడం లేదు. దాంతో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించడం ద్వారా,  కోవిడ్ ను నియంత్రించేలా ఫ్యూహాలు రచిస్తున్నారు.  

 

బెంగళూరులో వారం రోజుల లాక్ డౌన్ లో ముందస్తుగా తీసుకోవాల్పిన చర్యలపై హోంమంత్రి బసవరాజ్ పోలీసు అధికారులతో సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయన యశ్వంత్‌ పూర్‌లోని కేఆర్ మార్కెట్, సిర్సీ సర్కిల్, మెజెస్టిక్, ఆర్‌ఎంసి యార్డ్‌ను సందర్శించారు.ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కోవిడ్ నియంత్రణకు సహకరించాలని కోరారు.  

 

అయితే లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుంది.లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హోమ్ మంత్రి సూచించారు. మరోసారి వారం రోజుల లాక్ డౌన్ తో ప్రభుత్వం ప్రయత్నాలు,  ఏమేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: