ఈ విశ్వంలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి.. కానీ ఒకప్పుడు వాటిని వీక్షించేందుకు మనం ఎలాంటి సౌలభ్యం ఉండేది కాదు. ఎక్కడో పేపర్లో, మ్యాగజైన్ లో వస్తే కానీ చూసేవారు.  ప్రకృతిలో ఎప్పుడూ ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంటాయి.. అలాంటి వాటిని ఇప్పుడు మనం కళ్లారా వీక్షించే సౌలభ్యం వచ్చింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంతో మంది ఔత్సాహికులు ఎన్నో చిత్ర విచిత్రమైన వస్తువు, జంతువులు, పక్షులు.. ప్రకృతికి సంబంధించిన అరుదైన దృశ్యాలను షేర్ చేస్తున్నారు. అలాంటి వారిలో  ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నందా ఒకరు.  ఆయన ఇప్పటి వరకు ఎన్నో ప్రకృతిలో జరిగే అరుదైన దృశ్యాలను తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

 

అంతే కాదు వింత వింత జంతువులు.. ఆ జంతువులు చేసే అరుదైన విన్యాసాలు.. పాములు, పక్షులు, పువ్వులు, చెట్లు ఒక్కటేమిటి ప్రకృతిలో కొత్తగా ఏది జరిగితే దాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా మనం చిన్న చిన్న పురుగులను చూస్తుంటాం.. అవి చిత్ర విచిత్రమైన ఆకారాల్లో దర్శనమిస్తుంటాయి.  సాధారణంగా పూలు ఎన్నో రకాల ఆకృతిలో ఉంటుంటాయి.. కొన్ని పూలు జంతువులు, మనుషులు ఆకారంలో కూడా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఆర్కిడ్ పూలు కూడా ఒక‌టి. ఇలాంటి పువ్వు ఒక‌టి క‌దులుతున్న‌ది. అది కూడా ఓ పురుగు మాదిరి కదులూ కనిపించింది. ఈ పువ్వు క‌ద‌ల‌డ‌డానికి కార‌ణం ఒక పురుగు. ఈ కీట‌కం పువ్వులోనికి దూరి పువ్వులా రూపం మార్చుకున్న‌ది.

 

దీన్ని చూసిన‌ప్పుడు పురుగు అని ఎవ‌రూ అనుకోరు. తెలిసిన వారు త‌ప్ప‌. అంత‌లా మారిపోయింది. 10 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో పురుగు ఆకుపై క‌ద‌ల‌డం చూడొచ్చు.  ఈ కీట‌కాన్ని ఆర్కిడ్‌ మాంటిస్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపిస్తుంది. ఈ విచిత్ర‌మైన పూల వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఇలాంటి కీట‌కాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: