ఓ వైపు ప్రపంచం కరోనా వైరస్ తో గజగజ వణుకుతుంటే.. అసలు కోవిడ్-19 ఉందా.. ఉంటే ఎలా ఉంటుందని చూడాలని అనిపించింది ఓ యువకుడికి. ఏకంగా కరోనా సోకిన వ్యక్తితో కలిసి మందు కొట్టి పార్టీ చేసుకున్నాడు. బయటకు వస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనని కొందరు భయపడుతుంటే ఆ యువకుడు కోవిడ్ పేషంట్ తో కలిసి మందు కొట్టి ఆస్పత్రి పాలయ్యాడు.

 

 

ప్రస్తుత పరిస్థితిలో కరోనా ఎవరి నుంచి, ఎక్కడ నుంచి, ఎప్పుడ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లక్షణాలు ఉన్నా లేకున్నా ఒకరి నుంచి మరోకరికి కరోనా సోకుతుంది. ప్రపంచదేశాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయని అందరికి తెలిసిన సంగతే. కానీ కొందరు మాత్రం ఈ వైరస్ ను లైట్ గా తీసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ వస్తే ఎలా ఉంటుందని, వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు వైరస్ నిజంగానే ఉందా అంటూ ఏకంగా కరోనా సోకిన వ్యక్తితో కలిసి మందు కొట్టి, కరోనా బారిన పడి మరణించాడు.

 

 

ఆ యువకుడు చనిపోయే ముందు మాట్లాడిన మాటలతో అందరూ నివ్వెరపోయారు. ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది. శాన్ ఆంటోనియోలో మెథడిస్ట్ ఆస్పత్రి చీప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జానే ఆపిల్ బీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో చేరిన యువకుడు (30) కరోనాతో పరిస్థితి విషమించి మరణించాడు. అయితే అతడు చనిపోయే ముందు నర్సుతో అసలు విషయం తెలిసింది. 

 

 

కరోనా వైరస్ ఉందా ? లేదా ? అని పరీక్షించుకునేందుకు కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఓ పార్టీకి హాజరయ్యాడని తెలిపాడు. చివరి క్షణాల్లో నర్సుతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను తమాషాగా తీసుకున్నాను. నేను తప్పు చేశానంటూ ఆవేదన చెందాడని, లాంటి పరిస్థితుల్లో పార్టీలు అత్యంత ప్రమాదకరమని, నాలా మీరు ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించేందుకు చెబుతున్నానని అన్నాడంటూ డాక్టర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: