అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువనేతల్లో దేవినేని అవినాష్ ఒకరు. తండ్రి దేవినేని నెహ్రూ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్..2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తండ్రి నెహ్రూ టీడీపీలోకి వచ్చేయడంతో, ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు.

 

అయితే టీడీపీలోకి వచ్చాకే అవినాష్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. పార్టీ కోసం కష్టపడే తత్వమే ఆయనకు టీడీపీలో అభిమానులు పెరిగేలా చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు కీలకమైన తెలుగుయువత పదవి కూడా వచ్చింది. అసలు టీడీపీలో తెలుగు యువత పదవికు పూర్తి న్యాయం చేసింది కూడా దేవినేని అవినాష్‌నే. ఎప్పుడు పార్టీ కోసం కష్టపడుతూ, యువ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు నడిచారు.

 

హఠాత్తుగా తండ్రి మరణించిన కూడా పార్టీ కోసం కష్టపడటంలో ఎక్కడా తగ్గలేదు. ఆఖరికి అధినాయకుడు ఆదేశించారని చెప్పి, ఓడిపోతానని తెలిసి కూడా 2019 ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఇక ఆ ఎన్నికల్లో అందరూ ఘోరంగా ఓడిపోయి బయటకు రాని సమయంలో కూడా అవినాష్ బయటకొచ్చి, కార్యకర్తలకు అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు.

 

కానీ ఒక్కసారిగా తెలుగు యువత అధ్యక్షుడుగా అవినాష్ ఫాలోయింగ్ పెరిగిపోతుండటంతో, టీడీపీలో ఉన్న భజన నేతలు తట్టుకోలేకపోయారు. ఆయనపై అనేక రకాలుగా నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే ఇంత జరుగుతున్న కూడా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో అవినాష్ వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసి, ఇప్పుడు విజయవాడ తూర్పు ఇన్ చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు అవినాష్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి తెలుగు యువత పదవి ఖాళీగానే ఉంది.

 

ఇక ఈ పదవి కోసం ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ తీవ్రంగానే ట్రై చేస్తున్నారట. చినబాబు ద్వారా పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి చినబాబు, తనని డామినేట్ చేయకుండా తెలుగు యువత అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: