దేశంలో ప్రతి రోజు అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. ఈజాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండోస్థానంలో ఢిల్లీ మూడవ స్థానంలో ఉండేది అయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీ స్థానాన్ని కర్ణాటక భర్తీ చేస్తుంది. ఢిల్లీలో కొన్ని రోజుల నుండి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు గత కొన్ని రోజుల నుండి కర్ణాటకలో మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే ఢిల్లీ స్థానాన్ని కర్ణాటక భర్తీ చేస్తుంది.
 
ఇక ఈరోజు కర్ణాటకలో 2738 కేసులు నమోదుకాగా 73మంది కరోనాతో మరణించారు. ఆరాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41581కి చేరింది కాగా ఢిల్లీలో ఈరోజు 1246 కేసులు నమోదుకాగా 40మంది కరోనాతో మరణించారని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 113740 కేసులు నమోదుకాగా 3411మంది బాధితులు కరోనాతో మరణించారు.  
 
ఇదిలావుంటే కరోనా కేసుల్లో మొదటి ,రెండు స్థానాల్లో వున్న మహారాష్ట్ర ,తమిళనాడులో మాత్రం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు మహారాష్ట్రలో 6497 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 260,924 కు చేరింది అలాగే తమిళనాడులో కొత్తగా 4328 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 142,798కు చేరింది. ఇక ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 900000 దాటగా 23000 మంది బాధితులు కరోనాతో మృత్యువాత పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: