కరోనా అంటే ఏంటో అనుకున్నాం కానీ ... ఈ కరోనా వైరస్ ఎవరిని తేలిగ్గా వదిలిపెట్టడం లేదు  అందరి సరదా తీర్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి. జనాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలు ఏ రోజు ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలా  అందరూ ఈ వైరస్ ప్రభావానికి నష్టపోతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావానికి గురైన వారు కోట్లలో ఉంటే, మనదేశంలోనూ ఆ సంఖ్య లక్షల్లోకి చేరింది. లాస్ డౌన్ నిబంధనలు అమలు చేసిన సమయంలో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టు గా కనిపించినా, ప్రస్తుతం పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందరిలోనూ  భయం ఇలా ఉండగానే, తాజాగా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ వైరస్ మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, ఈ వైరస్ మహమ్మారి కాటుకు గురవుతారనే లెక్కలు చెబుతున్నారు. 


ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలనే సూచనలు అందుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దేశం అతలాకుతలం అవ్వడంతో పాటు, చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడపడం కూడా సాధ్యం అయ్యేపని కాదు అన్నట్టుగా పరిస్థితి రావడంతో, మరోసారి డౌన్ నిబంధనలు విధించే అవకాశం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చేయడంతో చాలా రాష్ట్రాలు సొంతంగానే ఈ నిబంధన అమలు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో పాటు, సెప్టెంబర్ లో అత్యధికంగా కేసులు నమోదు, మరిన్ని మరణాలు సంభవించడం చోటుచేసుకుంటాయని, ఇప్పుడు వార్తలు బయటకు వస్తుండడంతో ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు తీవ్రత పెరగ్గా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనూ, కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజల్లో అసహనం ప్రభుత్వంపై పడుతుందేమో అని ప్రధాని మోదీ సైతం ఆందోళన చెందుతూనే ఈ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపైన ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ వైరస్ ఉదృతంగా ఉండబోతుండడంతో, ప్రాణ నష్టం లేకుండా ఏ విధంగా ఏం చేయాలనే విషయంపై నిపుణులతో ప్రధాని చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: