రేప్ కేసులో ప్రధాన నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. నిందితుడు స్టేషన్ నుంచి పారిపోతే పోలీసులు పడరాని పాట్లు. కావాలనే పోలీసులు వదిలేశారని బాధితుల నుంచి ఆరోపణలు ఎదురవుతాయి. వివరాళ్లోకి వెళితే.. ఒడిశాలోని రాయగడలో ఓ ఖాళీ పోలీస్ స్టేషన్. ఎమైందో ఏమో కానీ అక్కడికి రెండు లారీల నిండా ప్రజలు వచ్చి స్టేషన్ ముందు ఆపారు.

 

 

దొంగ వెధను దింపండి అంటూ ఓ పెద్దాయన ఆవేశంతో రగిలిపోతున్నాడు. స్థానికులు లారీ నుంచి ఓ యువకుణ్ని దింపారు. పెద్దాయన ఆ యువకుడిని లాక్కొని స్టేషన్ లోనికి వెళ్తుంటే వెనకాల వందల మంది రావడాన్ని చూసాడు ఎస్త్సె. ‘‘ ఆగండి.. ఎవరు మీరు.. ఏమైంది.. ఎందుకు ఇంత మంది స్టేషన్లోకి వస్తున్నారు’’ అని అడిగాడు. పెద్దాయన మాట్లాడుతూ.. ‘‘సార్.. ఈ దొంగ వెధవా మా ఊరోడే.. మా ఊరి ఆడబిడ్డను రేప్ చేసిండు.. వీడికి ఉరిశిక్ష వెయ్యండి’’ అంటూ చెప్పాడు.

 


ఎస్సై మాట్లాడుతూ.. స్టేషన్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ బాలిక నుంచి స్టేట్ మెంట్ సేకరించాలని అనే లోపే పెద్దాయన తెలుసు సార్ ఆమెను కూడా తెచ్చామని వాళ్ల ముందు బాలికను నిలబెట్టాడు. కంప్లైంట్ తీసుకుని బాలికను ఆస్పత్రిక పంపించి, స్టేషన్లో ఇద్దరు పెద్ద మనుషుల్ని ఉంచి.. మిగిలిన వారిని ఇంటికి పంపించాడు ఎస్సై.

 

 

బాలికకు టెస్టులు చేసిన తర్వాత ఆమెను ఇద్దరు పెద్ద మనుషులకు అప్పగించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని చెప్పడంతో బాలికను తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత స్టేషన్లో అందరూ కూర్చొని టీ తాగుతూ ‘‘ నిందితుడిని ఏ సెల్ వెద్దాం’’ అని అనే లోపే నిందితుడి లేచి బయట జనం ఎవరూ లేరని గ్రహించి మెరుపు వేగంతో పరిగెత్తాడు.

 

 

ఆ క్షణం పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిగెడుతున్న కుర్రాడి వెంటే పోలీసులు లెగెత్తారు. స్టేషన్ మలుపు దగ్గర ఓ ట్రక్కును ఆ కుర్రాడు ఢీకొని దాని చక్రాల కింద పడ్డాడు. పోలీసులు ఆ నిందితుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు దేవుడే సరైన శిక్ష విధించాడని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: