తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతకు సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ఇంత అకస్మాత్తుగా ఈ కూల్చివేతలు అవసరమా అంటూ నిలదీస్తూ, నిందిస్తోంది. ఈ కూల్చివేతలు పూర్తికాకుండానే, ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు రేవంత్ సరికొత్త ఆరోపణలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేశారు. సచివాలయాన్ని కేవలం గుప్తనిధుల కోసమే ఇంత అకస్మాత్తుగా కూల్చుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొద్ది రోజులుగా కెసిఆర్ ఎవరికి అందుబాటులో లేకుండా, అదృశ్యం అవ్వడం, అర్ధరాత్రులు కూల్చివేతలకు పాల్పడడం వంటి అంశాలపై తాము లోతుగా పరిశీలిస్తే, గుప్తనిధుల తవ్వకాల కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయం బయటపడిందని రేవంత్ ఆరోపించారు.

 

IHG


 ముఖ్యంగా సచివాలయం భవనాల్లో ఉన్న జి బ్లాక్ అత్యంత పురాతనమైదని, దానిని నిజాం రాజులు నిర్మించారని చెబుతున్నారని, దానికింద గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు నమస్తే తెలంగాణ పత్రికలో దీనికి సంబంధించి ప్రచురితమైన కథనాలను ఆయన సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. అంతేకాదు సచివాలయానికి సమీపంలో ఉండే విద్యారణ్య స్కూల్ తవ్వకాల్లో సొరంగం బయటపడిందనే విషయాన్ని ఆయన చెప్పారు. అలాగే మింట్ కాంపౌండ్, హోమ్ సైన్స్ కాలేజీల్లోనూ ఇటువంటి సొరంగాలు బయటపడ్డాయి అని, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదని చెప్పారు. 

 

IHG


కాకపోతే కొన్నాళ్ళపాటు తవ్వకాలు కూడా జరిగినట్లుగా రేవంత్ చెబుతున్నారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు గతంలో పురావస్తు శాఖ జిహెచ్ఎంసి కి లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేవలం గుప్తనిధుల కోసమే అర్ధరాత్రి కూల్చివేతలు కార్యక్రమాన్ని ప్రారంభించారనే విషయాన్ని ఇప్పుడు రేవంత్ హైలెట్ చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. రేవంత్ ఆరోపణల్లో నిజం ఉందా ? లేక కూల్చివేతలు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకే రేవంత్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: