గతంతో పోలిస్తే టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు, రాజకీయ వారసుడు నారా లోకేష్ బాగా మెరుగు అయ్యాడు. ఎక్కడా తడుముకోకుండా ప్రసంగాలు చేస్తూ, ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో యాక్టివ్ గా ఉంటూ, ప్రభుత్వంపై పోరాడుతున్నాడు. పార్టీ కీలక నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తున్నాడు. ఇలా ప్రతి విషయంలోనూ లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తూ, పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో లోకేష్ అసమర్ధుడని, ఆయన చేతిలో పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ కోలుకోవడం  ముందు ముందు కష్టం అని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారు సైతం ఇప్పుడు లోకేష్ పనితీరును మెచ్చుకుంటున్నారు.

 

IHG


ఇదంతా ఇలా ఉంటే, లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం అంటూ, పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందట. లోకేష్ కు కీలక పదవి వస్తే, ఇక పార్టీ కమిటీలలోనూ యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తారని, అప్పుడు టిడిపి రాజకీయ వారసులకు అవకాశం ఇస్తారనే అభిప్రాయంలో పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. టిడిపిలో రాజకీయ వారసులకు కొదవలేదు. ఎంతో మంది పార్టీ వేదికగా ఎదగాలని, పార్టీలో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. 


దీని కోసం పార్టీ తరఫున ఏదైనా పదవి ఇస్తే, తమకు మరింత అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం లో ఉన్నారు. అందుకే వీరంతా లోకేష్ కు కీలక పదవి వస్తే  ఆ తర్వాత తమకు పదవులు వస్తాయని, తమ రాజకీయ భవిష్యత్తు కు తిరుగుండదనే అభిప్రాయంతో ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు కొంతమంది చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. యువ నాయకుల కంగారుని, బాధను చంద్రబాబు ఎప్పటికి అర్ధం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: