ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం ఉదయం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రమేష్ కుమార్ తెలిపారు.ఇందుకు ఏర్పాట్ల‌పై ఎన్నిక‌ల సంఘం ఆదేశాలను పంచాయితీరాజ్ అధికారులు ప‌క్క‌న‌పెట్టేశారు.ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు నిర్వహించాలని ఏపీ ఉద్యోగులు భీష్మించారు.ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసి కూడా ధిక్కారానికి సిద్ధమైపోతున్నారు. సాక్ష్యాత్తూ అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ జగన్ సర్కార్ పక్షాన నిలవడం సంచలనమవుతోంది.


ఉద‌యం 10గంట‌ల‌కు స‌మావేశానికి రావాల‌ని పంచాయితీరాజ్ శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీ గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంక‌ర్ ల‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఆదేశించారు. కానీ వారు హాజ‌రుకాక‌పోయే స‌రికి సాయంత్రం 3గంట‌ల‌కు రావాల‌ని వ‌ర్త‌మానం పంపారు.కానీ అధికారులు ఎన్నిక‌ల సంఘం ముందు అధికారులు హాజ‌రుకాలేదు.తాను సమావేశం నిర్వహిస్తే రాకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు.నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదని, వైఫల్యానికి అందరిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు...

ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటి అయ్యింది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు వినతిపత్రం అందజేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాల్గొనలేమని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెవెన్యూ పోలీస్ పంచాయితీరాజ్ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు సీఎస్ ను కలిసి 9 పేజీల వినతిపత్రాన్ని తాజాగా అందజేశారు.ఇప్పటికే నిమ్మగడ్డ కోరిన విధంగా ఓటర్ల జాబితా ఇవ్వడం కానీ.. నిధుల విడుదల కానీ.. క్షేత్రస్థాయిలో ఇతరత్రా సహకారం అందించేందుకు ఉద్యోగులు నిరాకరించారు.ఏకంగా సీఎస్ పదవిలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సైతం నిమ్మగడ్డ ఆదేశాలను లెక్కచేసే పరిస్థితుల్లో లేరు. రేపు నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అధికారులు చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: