తెలంగాణాలో రైతు వేదికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతు వేదికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. వరుసగా అన్ని జిల్లాల్లో రైతు వేదికలను  రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇక ఇదిలా ఉంటే పటాన్ చెరు మండలం నందిగామలో రైతు వేదిక ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు  ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ  కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి,  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి,  ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

 నందిగామ రైతు వేదిక జిల్లాలోనే చాలా అద్భుతంగా కట్టారు అని అన్నారు. అసలు ఈ రైతు వేదిక ఎందుకు అంటే..  రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని ఆయన అన్నారు.  వ్యవసాయం దెబ్బ తింటూ వచ్చింది అని హరీష్ ఆవేదన వ్యక్తం చేసారు.  గత పాలకులు రైతులను పట్టించుకోలేదు అని అన్నారు.  దేశానికే ఆదర్శంగా నిలిచింది మన తెలంగాణ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు.  వేల కోట్ల రూపాయలతో రైతులను ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి అన్నారు.

 నిజంగా రైతులను ఆదుకున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు.  ఈ వేదిక రైతులకు ఉపయోగకరంగా ఉండాలి అని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. మన ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటలు బాగా పెంచుతున్నారు అని అన్నారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నాము కావున సేంద్రియ వ్యవసాయం ,కొత్త పద్ధతులు అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు వేదిక ఎంత వాడుకుంటే అంత ఫలితాలు వస్తున్నాయి అని ఆయన వెల్లడించారు. రైతులతో మంచి చర్చా కార్యక్రమం చేపట్టాలి అని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ లో అల్లం,ఆలు గడ్డలు పండించి మంచి లాభాలు పొందుతున్నారు అని అన్నారు.  ఎమ్మెల్యే కోరినట్లు అమీన్ పూర్ లో మంచి రైతు వేదిక ను కట్టిస్తాము అని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: