ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హిందూమతం లక్ష్యంగా రాజకీయం జరుగుతుంది. అధికార పార్టీ నేతలు హిందూమతంపై దాడులు చేయిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిణామాల నేపధ్యంలో కాస్త జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా సిఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర  మంత్రులు చర్యలు చేపడుతున్నారు. హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, రాయలచెరువు సమీపంలో శ్రీశక్తి పీఠంలో పంచాహ్నిక హిందూ పరిరక్షణ యజ్ఞం చేపట్టారు. హిందూధర్మ పరిరక్షణకై శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకలు సిద్దేశ్వరానంద భారతి, శ్రీశక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంచాహ్నిక  హిందూ దేవాలయ పరిరక్షణ యజ్ఞం నిర్వహించారు. పంచముఖ గండబేరుండ మహాయాగంలో పాల్గొన్న ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలు నివారణకై స్వామివారి దృష్టికి తీసుకొచ్చి సూచనలు, సలహాలు తీసుకొంటున్నాము అని ఆయన అన్నారు. అనేక రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి దోహదపడుతున్నాయని మండిపడ్డారు అని ఆయన ఆరోపించారు. హింధు మతాన్ని కించపరిచే విధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. మిగిలిన దేవాలయాల్లో జరిగిన సంఘటనలపై చంద్రబాబు హస్తం ఉన్నట్లు ఆరోపణలు చేసారు. రామతీర్థంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి సంవత్సరం లోపు అంగరంగ వైభవంగా విగ్రహాలు ప్రతిష్టిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. తన కుటుంబ సభ్యలను క్రిస్టియన్ అనే చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హింధూ మతంపై మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. బీజేపీతో కలవక ముందు ఒక మాట, కలిసాక మాట మాట్లాడే పవన్ కళ్యాణ్  గురించి మాట్లాడాల్సి అవసరం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: