ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న కాని ఇంకా వెనకబడి వుంది.మిగతా దేశాలు బాగా అభివృద్ధి చెందాయి.. మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాని వెనకబడుతూనే వుంది. ధనవంతులు ఇంకా ధనవవంతులుగా మారుతున్నారు. పేదవారు ఇంకా పేదవాళ్లుగా మారుతున్నారు. ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు..

మరీ ముఖ్యంగా చెప్పాలంటే దేశ రాజకీయ వ్యవస్థ ఒక్కో సందర్బంలో ఒక్కోలాగ వ్యవహారిస్తుంటుంది. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను ఎన్నికల తరువాత నెరవేర్చడం మరిచిపోతున్నారు. మన రాష్ట్రంలో చూసుకుంటే చాలా సమస్యలే వున్నాయి. కాని ఒక్కోసారి అవి ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదు. ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోయినా ప్రభుత్వం ఆ సమస్యలని తెలుసుకోవాల్సిన బాధ్యత వారి పై వుంది. ఇక మన దేశంలో కాని మన రాష్ట్రంలో కాని బాగా వేదిస్తున్న సమస్య. రోడ్డు సమస్య. ఈ దారి సమస్య ఎలా ఉందంటే రోజు రోజుకి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రాణాలు కోల్పోయిన వారిని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా కాని ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. నిజం చెప్పాలంటే ఇది చాలా చిన్న సమస్య అని అనుకుంటారు కాని కాదు ఇది చాలా పెద్ద సమస్య.

ఇక ఆంద్రప్రదేశ్ లోని యారాడ ప్రాంతం విషయానికి వస్తే ఆ ప్రాంత కొండ కింద వుండే దారి చాలా ప్రమాదకరంగా వుంది. ఆ దారిలో అనేక బస్సులు వెళ్లడం జరుగుతుంది. కాని ఆ దారి చూస్తే చాలా ప్రమాదకరంగా వుంది.ప్రమాదకరమైన యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు చాలానే వున్నాయి. కాబట్టి ఆ సమస్యని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ సమస్య ఇండియా హెరాల్డ్ వారి దృష్టికి వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సద్దుమణిగేలా చెయ్యాలని కృషి చేస్తుంది. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి. లేదంటే ఆ బస్సు దారిలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా వున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: