ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఫిబ్రవరి 18న వేలం జరిగే అవకాశం ఉంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ రెడీ అవుతున్నాయి. చాలా మంది స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు.. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రమోషన్లూ ఇస్తున్నాయి. అవకాశాలు ఇవ్వలేని ప్లేయర్లను వేలంలోకి పంపించడంతో పాటు టీమ్‌కు అవసరం ఉన్న క్రికెటర్ల కోసం  మరోసారి కోట్లు వెచ్చించేందుకు సమాయత్తమవుతున్నాయి.

ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయ్. మినీ వేలం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయ్. ఇప్పటికే రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్‌ను ప్రకటించిన జట్టు యజమాన్యాలు వేలం కోసం కసరత్తులు మొదలుపెట్టాయ్.  ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బడ్జెట్, లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కుర్రాళ్ల వేటలో పడ్డాయి. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలం ఫిబ్రవరి 18న నిర్వహించే ఛాన్స్ ఉంది.

ఈ ఏడాది వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం 196కోట్లను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో గత సీజన్‌ను దుబాయ్ వేదికగా నిర్వహించగా.. తాజా సీజన్‌ను మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ నిర్వహణను బట్టి ఐపీఎల్‌పై ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.

ఐపీఎల్‌లో ప్రతి మూడేళ్లకూ ఓసారి మెగా వేలం నిర్వహిస్తారు. జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను విడిచిపెడతాయి. విడుదలయిన ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లూ వేలంలోకి వస్తారు. చివరగా 2018 సీజన్‌కు ముందు మెగా వేలం జరిగింది. అయితే ఐపీఎల్‌ 2020 ఆలస్యంగా జరగడంతో తర్వాతి సీజన్‌కు పెద్దగా సమయం లేకపోయింది. దీంతో ఈ సారికి మెగా వేలాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది బీసీసీఐ. మొత్తానికి ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది. క్రికెట్ లవర్స్ కు మాత్రం పండుగే పండుగ.







మరింత సమాచారం తెలుసుకోండి: