రాష్ట్రంలో రాజకీయాలది పై చేయిగా ఉంది. ఇక రాజ్యాంగ వ్యవస్థలు కూడా వాటితో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏపీలో ఇపుడు ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా సీన్ ఉంది. ఈ విషయంలో ఎవరూ తగ్గడంలేదు. అయితే హై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అయిపోయారు.

ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రొజు  విడుదల చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇపుడు ఎన్నికల సంఘం చేతుల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. వారు కాదని కూడదని అంటే వారి మీద ఎంతటి కఠిన శిక్ష అయినా తీసుకునే అవకాశం నిబంధనల మేరకు ఎన్నికల సంఘానికి ఉంటుంది. కానీ ఏపీలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉద్యోగులు బాహాటంగా ధిక్కరిస్తున్నారు.

తాము ప్రభుత్వానికే సహకరిస్తామన్నది వారి ధోరణిగా కనిపిస్తోంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఎన్నికలు ఇపుడు జరపడం ఇష్టం లేదు. మరో వైపు చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి నెలాఖరుకు రిటైర్ అవుతారు. ఆయన కోసం తాము ప్రభుత్వంతో చెడ్డ తెచ్చుకోవడం ఎందుకు అని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇది రాజ్యాంగ ధిక్కారం అని వారు భావించడంలేదు.

అదే సమయంలో ఎన్నికల సంఘం విధులు విధానాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలకు ఏ విధంగా ఆటంకం కలిగించినా కూడా కఠిన చర్యలు తప్పవంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. దాంతో రేపటి రోజున తనకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడంలేదని నిమ్మగడ్డ కోర్టుకు వెళ్తే ఉద్యోగుల మీద  వేటు పడుతుందని కూడా అంటున్నారు. ఉద్యోగులు ఈ విషయంలో హై రిస్క్ చేస్తున్నారని అంటున్నారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణా రావు. మరి ఉద్యోగుల తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కూడా  బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: