గతంలో ఎప్పుడు లేనంతగా బీజేపీ పార్టీ రెండు తెలుసు రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. గతంలో ఉందా లేడా అన్నట్లు ఉండే ఈ పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసి అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే కొద్దిగా బలపడిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి ఎంతో దూకుడుగా ప్రజల్లోకి పార్టీ ని దూసుకేల్లెలా చేస్తున్నాడు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు.. గతంలో ఏ అధ్యక్షుడు చేయనివిధంగా పార్టీ ని తొందరలోనే ప్రజల్లో కి తీసుకేల్లెలా పనిచేశారు.. ఇప్పుడు టీడీపీ తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నారంటే అదంతా సోము చలవే అని చెప్పాలి..

ఏపీలో బీజేపీని బలోపేతం చేసే ప్రక్రియను ఇప్పటికే  వేగవంతం చేసిన అయన  జంపింగ్‌ జిలానీలు, బీజేపీలో ఉంటూ పసుపు వాదన వినిపించే వారిని పక్కనపెట్టి బీజేపీ వాదులకు పదవులు కట్టబెట్టారు. ఇంటా, బయటా పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు తాళాలు వేశారు. దాంతో పార్టీ వర్గపోరు అనేది లేకుండా చేసి తద్వారా మంచి ప్రయోజనాలు అందుకునేలా ఆరంభంలోనే మంచి ప్రణాళిక వేసినట్లయింది.. ఇక అందరు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అందుకు తగ్గ విధంగా తన సొంత ప్రాంతంలో పార్టీ ని బలోపేతం చేయాలనీ సోము నిర్ణయించుకున్నారు..

అయితే ఇన్నాళ్లు టీడీపీ చేరికలు ప్రోత్సహించిన సోము ఇప్పుడు అధికార పార్టీ కే ఎసరు పెట్టారు..ఇటీవలే బీజేపీ నేతలు  గుంటూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మోదుగుల వేణుగోపాల రెడ్డి ని తమ పార్టీ లోకి తీసుకువచ్చెనందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ద్వారా మోదుగుల‌తో మంత‌నాలు చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మోదుగుల కూడా సోముతో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. అయితే, పార్టీ మారేదీ లేనిదీ.. ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని, త‌న అంచ‌నాల విష‌యంలో బీజేపీ సానుకూలంగా స్పందిస్తే.. మారే ఛాన్స్ ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: