ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనాన్ని ఇప్పటికీ ఎవరు మరిచిపోలేదు. జగన్ దెబ్బకు టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఇక వైసీపీ 151 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన జనసేన కేవలం ఒక సీటుకే పరిమితమైంది.

అయితే ఎన్నికలై ఏడాదిన్నర దాటేసింది. జగన్ సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్నారు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా జగన్ ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తూ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వి‌డి‌పి అసోసియేట్ ఆర్ అండ్ డి అనే పోలింగ్ ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 50 శాతం ఓట్లు రాగా, టీడీపీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక ఇప్పుడు సర్వేలో రెండు పార్టీలకు ఓటింగ్ శాతం పెరగడం విశేషం. ఇదే సమయంలో జనసేనకు ఓటింగ్ శాతం చాలా తగ్గింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు వైసీపీకి రాష్ట్రంలో 52.97% (+3.02) మంది ప్రజలు జై కొట్టారు. అలాగే టీడీపీ పక్షాన 40.06% (+0.89) మంది నిలిచారు. జనసేనకు 3.56% (-1.97) మద్దతు నిలిచారు. ఇక మిగిలిన శాతంలో బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయి.

అంటే ఇప్పటికీ జగన్‌దే పైచేయి ఉన్నా సరే వైసీపీకి, టీడీపీలకు కాస్త ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా  చెప్పుకోవాలంటే టీడీపీకి గతం కంటే కొంచెం ఓటింగ్ పెరగడం కలిసొచ్చే అంశం. అంటే జగన్ ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా టీడీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు, ఆ పార్టీకి ఆదరణ తగ్గలేదు. వీరు వైసీపీ వైపుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా మారతాయో.  

మరింత సమాచారం తెలుసుకోండి: