నెల్లూరు జిల్లా ఆది నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద స్కోప్ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ వేవ్ ఉన్న 2014 ఎన్నికల్లోనే నెల్లూరు జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 10 సీట్లలో 7 వైసీపీ గెలిస్తే, మూడు టీడీపీ గెలుచుకుంది. ఉన్న ఒక ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక 2019 ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మొత్తం జిల్లానే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి గుండు సున్నా మిగిలింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు కాస్త కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. అందరు కాకపోయిన కొందరు నాయకులు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇటీవలే చంద్రబాబు పార్లమెంటరీ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు.

అందులో భాగంగా నెల్లూరుకు అబ్దుల్ అజీజ్‌ని నియమించగా, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని ఉండే తిరుపతి పార్లమెంట్‌కు నరసింహ యాదవ్‌ని పెట్టారు.  అజీజ్ 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ కూడా ఆయనే. ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉండటంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

అటు నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోకి వస్తాయి. దీంతో నరసింహ యాదవ్ అప్పుడే ఫీల్డ్‌లోకి దిగి దూకుడుగా పనిచేస్తున్నారు.  వరుసగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నేతలని యాక్టివ్ చేస్తున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బీదా రవిచంద్రయాదవ్ ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉన్నారు. ఈయనకు పార్టీలో కీలక పదవి రానుందని తెలుస్తోంది. అలాగే నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మామూలు దూకుడు ప్రదర్శించడం లేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక ఎలాగో సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి అండగా ఉన్నారు. మరి ఇంత కష్టపడుతున్న తమ్ముళ్ళు నెల్లూరులో వైసీపీకి చెక్ పెట్టి టీడీపీని గెలిపించగలరేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: