చింతకాయల అయ్యన్నపాత్రుడు....టీడీపీ సీనియర్ నేత. మూడు దశాబ్దాల పైనుంచి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ, విలువలు పాటిస్తున్న నేత. విశాఖపట్నం నర్సీపట్నం నుంచి 9 సార్లు పోటీ చేసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చిత్తుగా ఓడిపోయారు. డైరక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమా శంకర్ గణేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

అయితే ఓడిపోయిన దగ్గర నుంచి అయ్యన్న బాగా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వరుసపెట్టి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టడం ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక జగన్ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తున్నట్లు ప్రకటించాక, అక్కడ చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు
.
కానీ అయ్యన్న మాత్రం సైలెంట్ కాలేదు. ప్రభుత్వం మీద దూకుడుగానే వెళుతున్నారు. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా ముందుకెళుతూ, కొందరు వైసీపీ నేతలని టార్గెట్ చేస్తూ, నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జయరాంని ఏ రకంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. ఆయన మీద బెంజ్ కారు, భూకుంభకోణాల ఆరోపణలు చేసి హల్చల్ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో తెలియదుగానీ, ప్రజల్లో మాత్రం వైసీపీ నేతలు ఏదో చేస్తున్నారు అనే ఇంటెన్షన్ మాత్రం క్రియేట్ చేస్తున్నట్లు కనబడుతుంది.

అయితే సొంత నియోజకవర్గంలో అయ్యన్న ఔట్ డేట్ అవ్వడం వల్లే ఇలా రాజకీయం చేస్తున్నారని స్థానిక వైసీపీ కార్యకర్తల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. నర్సీపట్నంలో అయ్యన్న పని అయిపోయిందని, ఇక అక్కడ వైసీపీదే పైచేయి అంటున్నారు. ఎమ్మెల్యే ఉమా శంకర్ దూకుడు ముందు అయ్యన్న తేలిపోతున్నారని, నర్సీపట్నంలో అయ్యన్నని వైసీపీ ఘోరంగా దెబ్బకొట్టిందని, ఇక అక్కడ అయ్యన్న గెలుపు రుచి చూడటం కష్టమని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: