వాజ్ పేయి  కాలం నుంచి బీజేపీకి రాజ్యసభలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోక్సభలో బీజేపీ కి భారీ మెజారిటీ సంపాదించినప్పటికీ రాజ్యసభలో మాత్రం  మెజారిటీ లేక బిల్లుల  విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బిజెపి పార్టీకి ఇబ్బందులు తప్పలేదు. లోక్ సభలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న ఎన్డీఏ రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ కి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నికై రాజ్య సభ సభాపతి గా ప్రమాణ స్వీకారం చేసే ముందు వరకు రాజ్యసభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఉండటంతో అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదు.




 అయితే ఇక రాజ్యసభ సభాపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికైనప్పటినుంచి బిజెపికి కాస్త ఊరట లభిస్తున్నప్పటికీ డిప్యూటీ స్పీకర్ గా మాత్రం కాంగ్రెస్కు చెందిన నేత కొనసాగుతూ ఉండటం తో బీజేపీకి పలు బిల్లుల విషయంలో ఆలస్యం అవుతూ వచ్చిన  విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే లోక్సభలో పూర్తి మెజారిటీతో ఉండి  అన్ని రకాల బిల్లులను ఎంతో సులభంగా ఆమోద ముద్ర వేయించుకున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కూడా త్వరలో ఎంతో బలాన్ని సంపాదించుకోపోతున్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో జరుగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ రాజ్యసభ బలాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.



 ఇక ఇటీవలే రాజ్యసభ చైర్ పర్సన్  డిప్యూటీ చైర్మన్ కూడా ఎన్డీఏ కూటమికి చెందిన వారే  ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా త్వరలో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 11 రాజ్యసభ స్థానాల్లో  ఉత్తరప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఉండగా... ఉత్తరప్రదేశ్ బిజెపి పార్టీ ఎంతో బలంగా ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్లో దాదాపుగా పది రాజ్యసభ స్థానాలు బీజేపీ  కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ లో  కూడా ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనుండగా అక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నవంబరు 9న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజ్యసభ స్థానాల్లో బీజేపీ గెలిస్తే మంచి బలం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: