ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంకండి అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జిన్ పింగ్  జారీ చేసిన ఆదేశాలు  ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిపోయాయి. కానీ జిన్ పింగ్  ఆదేశం వెనక అసలు మర్మం ఏమిటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విధంగా ఉంది. ఎందుకంటే ఒక దేశంతో వివాదాలు చెలరేగినప్పుడు యుద్ధానికి సిద్ధంకండి అంటే కేవలం ఆ దేశంతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది అని అర్థం చేసుకోవచ్చు... ప్రస్తుతం చైనా.. ఓవైపు తైవాన్ చైనాలో దేశంలో భూభాగం అంటూ చెబుతూ చీదరింపులు గురవుతూ తైవాన్ తో  యుద్ధానికి సిద్ధమైంది.. అదే సమయంలో జపాన్ కు సంబంధించిన దీవులను మావి  అంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తూనే ఉంది చైనా.




 ఇక మరోవైపు అమెరికా చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంలో పరస్పరం కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. భారత చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ చైనా సరిహద్దు లో నిషేధిత ప్రాంతంలో కి వచ్చి చైనా తిష్టవేసుకుని కూర్చోవడంతో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి 1961 ముందు చైనా స్వాధీనం చేసుకున్న భారత భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన వివాదం నేపథ్యంలో భారత్  సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని  యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలె చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ చైనా సైన్యాన్ని ఇచ్చిన పిలుపు ఏ  దేశంతో యుద్ధం చేయడానికి అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చుట్టూ ఉన్న నాలుగు దేశాలతో చైనా వివాదానికి తెరలేపి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో అసలు ఏ దేశంతో చైనా యుద్ధం చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. యుద్ధానికి సిద్ధంకండి అంటూ ఇచ్చిన పిలుపుతో ఆయా దేశాల సైన్యాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అదే సమయంలో చైనా ఒకేసారి ఏకంగా నాలుగు దేశాలతో యుద్ధం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: