భారత్ చైనా సరిహద్దు లో రోజురోజుకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.  ఇక ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ ఇచ్చిన పిలుపు ప్రస్తుతం మరింత సంచలనాత్మకంగా మారిపోయింది. ఇప్పటికే చైనాలోని వ్యూహాత్మక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని చైనాపై ఎప్పుడు యుద్ధం  జరిగిన పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఎన్నో అధునాతన టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేర్చుకుని ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సంసిద్ధం అయిపోయింది.



 ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చైనా భారత సరిహద్దుల్లో ఎప్పుడూ యుద్ధం తలెత్తుతుందో  అన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు చర్చలు జరుగుతూ వచ్చినప్పటికీ విఫలమవుతూనే ఉన్నాయి. కాగా  ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ చైనా సైన్యానికి పిలుపునివ్వడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. జిన్ పింగ్  ప్రత్యేకంగా తమ సైన్యానికి యుద్ధానికి సిద్ధంకండి అంటూ పిలుపునిచ్చారని కాని భారత సైన్యానికి అలాంటి పిలుపు అవసరం లేదు అంటూ చెబుతున్నారు.



 సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని  కాపాడుకోవడం కోసం భారత ఆర్మీ ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటాయి అని చెబుతున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా ఓ వైపు ఉగ్రవాదులతో మరోవైపు దాయాది దేశమైన పాకిస్తాన్తో నిరంతరం యుద్ధం కాని యుద్ధం చేస్తూనే ఉంటుంది భారత సైన్యం. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని దేశం కోసం యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇక అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలు అమలు చేస్తూనే ఉంటుంది. అలాంటి భారత సైన్యానికి ప్రత్యేకంగా ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంకండి అని చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు . భారత సైన్యం ఎప్పుడు సై అంటే సై అన్నట్లుగానే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: