స్వతంత్రం నాటినుంచి ఇప్పటివరకు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నా.. రక్షణ రంగ విషయంలో మాత్రం ఒక అడుగు వెనక్కి ఉంది. అయితే నేటి పరిస్థితులు భారతదేశానికి ఒక సవాలుగా మారాయి. ఎందుకంటే వరుస సరిహద్దు వివాదాలతో.. దాయాది దేశాలైన ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని. ఏకంగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని కోరుకుంటున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు చైనా, పాకిస్తా న్ తో యుద్ధం వస్తే భారత్ ఎదురొడ్డి నిలబడగలదా అనే సందేహానికి మన శాస్త్రవేత్తలు తెర దింపారు. కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత్ ని రక్షణ రంగంలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు.


 దీనిలో భాగంగానే ఫ్రాన్స్ నుంచి 36 రఫెల్ యుద్ధ విమానాలను 59 వేల కోట్ల రూపాయలకు దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ ను, మిగ్ -21 హెలికాఫ్టర్ను , సుఖోయ్ యుద్ధ విమానాలను, అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్ ను భారత్ దిగుమతి చేసుకుంది. అయితే భారత్ కు DRDO ఒక మంచి శుభవార్త అందించింది. మరో నాలుగేళ్లలో హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ల ను భారత్లో తయారు చేస్తుందని దీనికి సంబంధించి ఫార్ములాలను మన శాస్త్రవేత్తలు డి ఆర్ డి ఓ కే అందించారని చెప్పింది. ఇక ఈ టెక్నాలజీనే గాని మన శాస్త్రవేత్తలు మన రక్షణ రంగానికి అందించినట్లయితే మన దేశం రక్షణ రంగ విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడే ప్రసక్తే లేదు.


ఇదివరకే చాలా దేశాల నుంచి యుద్ధ రంగానికి అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకుని ఆయుధ సంపత్తి లో మనకంటూ ఒక స్థానాన్ని సమకూర్చుకున్నాం. ఒకప్పుడు మన శాస్త్రవేత్తలు ఇతర దేశాల కరెన్సీ కి ఆశపడి మన టెక్నాలజీ ని వాళ్ల చేతుల్లో పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశాన్ని ఆయుధ సంపత్తి లో దీటుగా తయారుచేయడానికి పూనుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: